తక్కువ బడ్జెట్‌లో సూపర్ స్మార్ట్ ఫోన్‌.. 

23 September 2023

ఇన్‌ఫినికిస్స్‌ జీరో 8ఐ స్మార్ట్ ఫోన్‌లో 8జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ను లాంచ్‌ చేశారు. 256 జీబీ వరకు స్టోరేజీని పెంచుకోవచ్చు. 

ఇక ఈ స్మార్ట్ ఫోన్‌ ధర విషయానికొస్తే రూ. 18,999గా ఉండనుంది. తర్వాతి సేల్ ఎప్పుడన్నదానిపై కంపెనీ ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టతనివ్వలేదు. 

కెమెరా విషయానికొస్తే ఇన్‌ఫినిక్స్‌ జీరో 8ఐ స్మార్ట్ ఫోన్‌లో 48ఎంపీ+2ఎంపీతో కూడిన రెయిర్‌ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీల కోసం 16ఎంపీ+8 ఎంపీ డ్యూయల్‌ ఫ్రంట్‌ కెమెరా సెటప్‌ను అందించారు. 

ఈ స్మార్ట్ ఫోన్‌ మీడియా టెక్‌ హీలియో జీ90టీ అనే అధునాతన ప్రాసెసర్‌తో పని చేస్తుంది. ఫోన్‌ స్పీడ్‌ పెంచడంలో దీనిదే కీలక పాత్ర. 

ఇక ఈ స్మార్ట్‌ ఫోన్‌ స్క్రీన్‌ విషయానికొస్తే ఇందులో 6.85 ఇంచెస్‌తో కూడిన ఫుల్‌హెచ్‌డీ+ స్క్రీన్‌ను అందించారు. పిన్‌ హోల్‌, న్యారో బెజెల్స్‌ డిస్‌ప్లే ఈ ఫోన్‌ సొంతం. 

బ్యాటరీ విషయానికొస్తే ఇందులో 4500 ఎమ్‌ఏహెచ్‌ కెపాసిటీగల ఎల్‌ఐ-ఐయాన్‌ పాలీమర్‌ బ్యాటరీని అందించారు. 

ఇక ఈ స్మార్ట్ ఫోన్‌లో ఏఐ సీన్‌ డిటెక్షన్‌ వంటి అధునాతన ఫీచర్‌ను అందించారు. దీంతో కెమెరాతో తీసే ఫొటోలు మరింత క్లారిటీతో వస్తాయి. 

ఇందులోని ప్రాసెసర్‌ కారణంగా ఫోన్‌ హ్యాంగ్‌ అవ్వదు. ఒకేసారి ఎక్కువ యాప్‌లను ఓపెన్‌ చేసినా ఫోన్‌ పర్ఫామెన్స్‌ విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండదని కంపెనీ చెబుతోంది.