ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం ఇన్ఫీనిక్స్ స్మార్ట్ 8 స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసింది. గతేడాది నైజీరియాలో లాంచ్ అయిన ఈ ఫోన్ తాజాగా భారత్‌లోకి అడుగుపెట్టింది.
ఈ స్మార్ట్ ఫోన్‌లో మీడియా టెక్ హీలియో జీ35 ప్రాసెసర్‌ను అందించారు. ఇక ఇందులో 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీని ఇచ్చారు.
ధర విషయానికొస్తే 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 7,499 కాగా లాంచింగ్ ఆఫర్‌లో భాగంగా కేవలం రూ. 6,749కే సొంతం చేసుకోవచ్చు.
ఈ స్మార్ట్ ఫోన్ ప్రముఖ కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో జనవరి 15వ తేదీ నుంచి అందుబాటులోకి రానుంది. ఈ ఫోన్ గెలాక్సీ వైట్, రెయిన్‌బో బ్లూ, షైనీ గోల్డ్, టింబర్ బ్లాక్ కలర్స్‌లో లభిస్తుంది.
ఇందులో 6.6 ఇంచెస్‌తో కూడిన హెచ్‌డీ+ స్క్రీన్‌ను అందించనున్నారు. 90Hz రిఫ్రెష్ రేట్ ఈ స్క్రీన్ సొంతం. 12ఎన్‌ఎం ఆక్టాకోర్ మీడియా టెక్ హీలియో జీ36 ప్రాసెసర్ ఇచ్చారు.
4జీబీ ర్యామ్‌ను వర్చువల్‌గా 8జీబీ వరకు పెంచుకోవచ్చు. అలాగే స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 2 టీబీ వరకు పెంచుకునే అవకాశం కల్పించారు
ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 గో ఎడిషన్ ఆధారిత ఎక్స్‌ఓఎస్13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఇందులో ఫింగర్ ప్రింట్ సెన్సర్‌ను సైడ్‌కు అందించారు.
కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీలకో 8 ఎంపీతో కూడిన ఫ్రంట్ కెమెరాను ఇచ్చారు.