చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం ఇన్‌ఫీనిక్స్.. భారత మార్కెట్లోకి ఇన్‌ఫీనిక్స్ స్మార్ట్ 8 పేరుతో కొత్త ఫోన్‌ను లాంచ్ చేయనుంది. ఈ ఫోన్ ఇప్పటికే నైజీరియాలో లాంచ్ అయ్యింది.
ఇన్‌ఫీనిక్స్ స్మార్ట్ 7కి తర్వాతి వెర్షన్‌గా ఈ ఫోన్ మార్కెట్లోకి రానుంది. ఈ ఫోన్ ధర మన దేశంలో రూ. 7 వేలకి అందుబాటులోకి రానుందని సమాచారం.
ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో.. స్మార్ట్ 8లో 6.6 ఇంచెస్‌తో కూడిన హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించనున్నారు. పీక్ బ్రైట్‌నెస్ 90 హెర్ట్జ్‌గా ఉండనుంది.
ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ ఫోన్ యూనిసోక్ టీ606 ప్రాసెసర్‌తో పని చేస్తుంది. 4 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ ఈ ఫోన్ సొంతం.
మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా మెమోరీని పెంచుకునే అవకాశం ఉంది. కెమెరా విషయానికొస్తే 50 ఎంపీ రెయిర్ కెమెరా, సెల్ఫీల కోసం 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఇవ్వనున్నట్లు సమాచారం.
ఇక ఈ స్మార్ట్ ఫోన్‌లో 10 వాట్స్‌కి సపోర్ట్ చేసే 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీని ఇవ్వనున్నారు. డ్యూయల్ సిమ్ 4జీ వోల్టే, వైఫై, బ్లూటూత్ వీ5, జీపీఎస్ ఈ ఫోన్ సొంతం.
అలాగే ఇందులో వెనకాల ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఇవ్వనున్నారు. 3.5 ఎంఎం ఆడియో జాక్ ద్వారా ఇయర్ ఫోన్స్ కనెక్ట్ చేసుకోవచ్చు.
నైజిరీయాలో లాంచ్ అయిన ఫోన్‌కి కొన్ని ఫీచర్లను అప్‌డేట్ చేసి భారత్‌లో లాంచ్ చేయనున్నారని తెలుస్తోంది. ఇందులో ప్రధానమైంది కెమెరా.