ఇన్‌ఫినిక్స్ భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్ చేస్తోంది. ఇన్‌ఫినిక్స్ 40ఐ పేరుతో కొత్త ఫోన్‌ను తీసుకొస్తోంది. ఈ ఫోన్ ఈరోజు లాంచ్ కానుంది.
ఇన్‌ఫినిక్స్ హాట్ 40, ఇన్‌ఫినిక్స్ హాట్ 40 ప్రో మోడల్ ఫోన్‌లు కూడా రానున్నాయి. ఇందులో యూనిసోక్ టీ606 ఎస్వోసీ చిప్ సెట్, 50-మెగా పిక్సెల్ డ్యుయల్ కెమెరా సెటప్‌ను అందిస్తున్నారు.
ఇందులో 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000 ఎంఏహెచ్ బ్యాటరీని అందిస్తున్నారు. ఈ ఫోన్‌ను 8 జీబీ ర్యామ్, 256 స్టోరేజ్ వేరియంట్‌లో తీసుకురానున్నారు.
ధర విషయానికొస్తే ఇన్‌ఫినిక్స్ హాట్ 40ఐ ఫోన్ ధర సుమారు రూ.8,300 ఉండనుందని అంచనా. లాంచింగ్ సమయంలో ధరపై క్లారిటీ రానుంది.
ఇన్‌ఫినిక్స్ హాట్ 40ఐ ఫోన్ 60 హెర్ట్జ్-90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్‌తోపాటు 6.56 అంగుళాల హెచ్డీ+ ఎల్‌సీడీ డిస్‌ప్లేను అందిస్తున్నారు. 720×1612 పిక్సెల్స్ డిస్‌ప్లేను ఇవ్వనున్నారు.
పీక్ బ్రైట్ నెస్ 480 నిట్స్‌ను అందిస్తున్నారు. ఇక ఈ ఫోన్ యూనిసోక్ టీ606 ఎస్వోసీ ప్రాసెసర్‌ను అందిస్తున్నారు. స్టోరేజ్‌ని మైక్రో ఎస్డీ కార్డుతో టిగా బైట్ వరకు పెంచుకోవచ్చు.
ఇక ఇందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బ్యాక్డ్ డ్యుయల్ కెమెరా సెటప్‌తో తీసుకొచ్చారు. అథెంటికేషన్ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్‌ను ఇచ్చారు.
కెమెరా విషయానికొస్తే ఇందులో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32 ఎంపీ ఫ్రంట్ కెమెరాను ఇచ్చారు.