వాట్సాప్‌లో మరో అదిరిపోయే ఫీచర్.. తెలిస్తే వావ్ అనాల్సిందే..
19 August 2023
ఇప్పటి జీవనవిధానంలో వాట్సాప్ ఓ భాగం అయిపొయింది. ఇది లేనిదే రోజు గడవడం లేదు. వాట్సాప్ లేని స్మార్ట్ ఫోన్ ఉండదు.
సోషల్ మీడియా దిగ్గజం వాట్సాప్ ఎప్పుటికప్పుడు ఎదో ఒక కొత్త ఫీచర్స్ తో యూజర్లను ఆకట్టుకుంటు వస్తుంది.
ఇపుడు మరో కొత్త ఫీచర్ తో వినియోగదారులను ఆకట్టుకుంటుంది. మరి ఆ ఫీచర్ ఏంటో, ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇకనుంచి హెచ్‌డీ క్వాలిటీలో ఫోటోలను సెండ్ చేసుకొనే సదుపాయాన్ని కల్పించింది వాట్సాప్. అస్సలు బ్లర్ కాకుండా సెండ్ అవుతాయి.
దీని కోసం ముందుగా ఫోటో పంపాలనుకొనేవారి చాట్ బాక్స్ ఓపెన్ చేసి అట్ఠచ్ మెంట్ సింబల్ లేదా కెమెరా సింబల్ పై క్లిక్ చెయ్యండి.
తర్వాత గేలరీలోకి వెళ్లి కావలిసి ఇమేజ్ లేదా ఫోటోపై క్లిక్ చేస్తే పైన హెచ్‌డీ అని కనిపిస్తుంది. దానిపై క్లిక్ చెయ్యండి.
తర్వాత కొన్ని క్వాలిటీ ఆప్షన్స్ కనిపిస్తాయి. మీకు ఎంత క్వాలిటీలో కావాలో అంత సెలెక్ట్ చేసి సెండ్ చేయండి.
అంతే హెచ్‌డీ క్వాలిటీతో ఫోటోలు సెండ్ అవుతాయి. ఇంకెందుకు ఆలస్యం హెచ్‌డీ క్వాలిటీ ఫోటోలతో మీ అందాన్ని మీ వాళ్ళతో పంచుకోండి.
ఇక్కడ క్లిక్ చెయ్యండి