మీ కంప్యూటర్‌ స్లో అవుతోందా.? ఈ టిప్స్‌ పాటించండి 

21 August 2023

కంప్యూటర్‌ ఫాస్ట్‌గా రన్‌ కావాలంటే మంచి యాంటీ వైరస్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి. ఎప్పటికప్పుడు యాంటీ వైరస్‌ను అప్‌డేట్ చేసుకోవాలి.

అప్పుడప్పుడు కంప్యూటర్‌ను రీస్టార్ట్‌ చేస్తుండాలి. ఎక్కువ ప్రోగ్రామ్స్‌ నిత్యం బ్యాగ్రౌండ్‌లో రన్‌ అవుతుంటాయి. కాబట్టి రీస్టార్ట్ చేస్తుండాలి. 

కొన్ని సందర్భాల్లో హార్డ్‌వేర్‌ ఫెయిల్ అయినా కంప్ట్యూటర్‌ స్లో అవుతుంది. హార్డ్‌వేర్‌ కాంపోనెట్స్‌ డ్యామేజ్‌ అయితే స్లో అవుతుంది.

ఇక కంప్యూటర్‌ బాగా పాతది అయిన సమయంలోనూ స్లో అయ్యే అవకాశం ఉంటుంది. లేటెస్ట్‌ అప్‌డేట్స్‌కు సిస్టమ్‌ సపోర్ట్ చేయకపోవడం వల్ల నెమ్మదిస్తుంది. 

ఇక కాలం తీరిన డ్రైవర్స్‌ వల్ల కూడా కంప్యూటర్‌ పర్ఫా్మెన్స్‌ తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు డ్రైవర్స్‌ను మార్చుకోవాలి. 

కంప్యూటర్‌ స్లో కావడానికి మరో కారణం బ్యాగ్రౌండ్‌లో ప్రోగ్రామ్స్‌ రన్‌ కావడం. కాబట్టి అవసరం లేని ప్రోగామ్స్‌ను క్లోజ్‌ చేసుకోవాలి

కంప్యూటర్‌ హార్డ్‌ డిస్క్‌లో మెమోరీ పూర్తిగా నిండిపోయినా కంప్యూటర్‌ స్లో అవుతుంది. కాబట్టి అసరం లేని డేటాను డిలీట్ చేస్తుండాలి. 

జంక్‌ ఫైల్స్‌ నిండినా కంప్యూటర్‌ వేగం తగ్గుతుంది. ఈ ఫైల్స్‌ను ఎప్పటికప్పడు డిలీట్‌ చేయడం వల్ల సిస్టమ్‌ వేగం పెరుగుతుంది.