ఒకప్పుడు వైర్‌లెస్ ఇయర్ బడ్స్ కొనాలంటే కనీసం రూ. 10 వేలు పెట్టాల్సి వచ్చేది. కానీ ప్రస్తుతం రూ. వెయ్యికే వైర్‌లైస్ ఇయర్ బడ్స్ అందుబాటులోకి వస్తున్నాయి.
అయితే మార్కెట్లో నిత్యం ఎన్నో కొత్త ఇయర్ బడ్స్ లాంచ్ అవుతోన్న తరుణంలో.. అసలు కొనుగోలు చేసే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
ఇయర్ బడ్స్‌లో మంచి క్వాలిటీ ఆడియో కావాలంటే సదరు బడ్స్‌లో aptX, aptX HD, LDAC, AAC వంటి కోడెక్స్‌ను (codecs) వినియోగించారో లేదో చూసుకోవాలి.
బ్లూటూత్ 5.3 ప్రస్తుతం లేటెస్ట్ వెర్షన్ అందుబాటులో ఉన్నాయి. వీలైనంత వరకు బ్లూటూత్ 5.0+ కనెక్టివిటీతో ఉండేవి తీసుకుంటే మంచిదని టెక్ నిపుణులు చెబుతున్నారు.
ఇక గేమింగ్ ఇష్టపడే వారు తక్కువ లేటెన్స్ ఉండే ఇయర్ బడ్స్‌ను ఉపయోగించుకోవాలి. అప్పుడు తక్కువ ల్యాగ్ ఉంటుంది. ప్రీమియం ఇయర్ బడ్స్‌లో లేటెన్సీ 20 మిల్లీసెకండ్స్ కంటే తక్కువ ఉంటుంది.
ఇయర్ బడ్స్ కొనే ముందు ఛార్జింగ్‌ను కూడా ప్రాధాన్యతలోకి తీసుకోవాలి. కేస్, ఇయర్ బడ్స్ కలిపి 35 గంటల కంటే ఎక్కువ ప్లే బ్యాక్ ఉండే ఇయర్ బడ్స్‌ను తీసుకుంటే మంచిది.
ఇయర్ బడ్స్‌లో నాయిస్ క్యాన్సిలేషన్ ఉండేలా చూసుకోవాలి. దీనిద్వారా బయటి నుంచి వచ్చే శబ్ధాలను అల్గారిథమ్స్ ద్వారా బయట నుంచి వచ్చే శబ్ధాలను అడ్డుకుంటుంది.
కాల్స్ మాట్లాడే సమయంలో, పాటలు వినే సమయంలో శబ్ధాలను అట్టుకుంటాయి. కనీసం 30 డెసిబుల్స్ వరకు శబ్ధాలను అడ్డుకునే ఇయర్ బడ్స్‌ను తీసుకోవాలి.