రిస్క్ వద్దు.. వైద్యం కోసం చాట్ జీపీటీ వద్దే వద్దు.
30 December 2023
ప్రస్తుతం చాట్ జీపీటీ సేవలు ఓ రేంజ్లో విస్తరిస్తున్నాయి. ఒకప్పుడు గూగుల్ సెర్చ్ చేసే వారు ఇప్పుడు, చాట్ జీపీటీని ఉపయోగిస్తున్నారు.
ప్రతీ చిన్న సమాచారానికి చాట్ జీపీటీని ఓపెన్ చేసి తెలుసుకుంటున్న రోజులివీ. అయితే కొన్ని విషయాల్లో చాట్ జీపీటీ ఉపయోగం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.
వైద్యపరమైన సలహాల కోసం చాట్ జీపీటీని ఉపయోగిస్తే చిక్కులు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ముఖ్యంగా ఫ్రీ వెర్షన్ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని, చాట్‌జీపీటీ ఇచ్చే సమాధానాలను గుడ్డిగా నమ్మొద్దని సూచిస్తున్నారు.
వైద్యపరమైన ప్రశ్నలకు సరైన సమాచారం ఇవ్వకపోగా కొన్ని సందర్భాల్లో అసంపూర్తిగా, కచ్చితత్వం లేని సమాధానాలు ఇస్తోందని వెల్లడైంది.
వైద్య పరమైన మార్గదర్శకాల కోసం చాట్‌జీపీటీపై ఆధారపడే వారికి ఇది ఇబ్బందిగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు.
మెడిసిన్స్ విషయంలో యూజర్ల ప్రశ్నలకు చాట్‌జీపీటీ ఫ్రీ వెర్షన్ ఇచ్చిన సమాధానాలను లాంగ్ ఐలండ్ యూనివర్సిటీ ఫార్మసిస్టులు ఇటీవల నిర్వహించని అధ్యయనంలో పరిశీలించారు.
వీటిలో మూడో వంతు ప్రశ్నలకు చాట్ జీపీటీ అసంపూర్తి సమాధానాలు ఇచ్చిందని ఫార్మసిస్టులు నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది.