చంద్రుడి దక్షిణ దృవంపై ల్యాండ్ అయిన విక్రమ్ ల్యాండర్ నుంచి నెమ్మదిగా బయటకు వచ్చింది ప్రజ్ఞాన్ రోవర్. వచ్చి రాగానే చంద్రుడిపై తన ప్రయాణాన్ని మొదలు పెట్టింది.
ఇక ప్రజ్ఞాన్ రోవర్ ఒక డ్రైవర్లెస్ కారు లాంటిది. ఇది చంద్రుడిపై దానికదే స్వయంగా తిరుగుతుంది. భూమి నుంచి ఆపరేటింగ్ చేయడం అంటూ ఉండదు.
రోవర్‌కు ఏర్పాటు చేసిన స్మార్ట్ కెమెరాల ఆధారంగా రాళ్లను చూసుకుంటూ ముందుకు సాగుతుంది.
చంద్రుడిపై తిరిగే ఈ రోవర్.. అక్కడి వాతావరణం, ఉష్ణ లక్షణాలను కొలుస్తుంది. ఇక అయాన్లు, ఎలక్ట్రాన్‌ల సాంద్రతపై అధ్యయనం చేస్తుంది
రోవర్‌లో ఉన్న లేజర్ రెట్రోరిఫ్లెక్టర్ అర్రే పరికం చంద్రుడిపై గతిశాస్త్రాన్న అర్థం చేసుకునేందుకు సహాయపడుతుంది.
రోవర్‌లో మొత్తం 7 సెన్సార్లు ఉంటాయి. అలాగే ఇందులోని ల్యాండర్ డిటెక్షన్ అండ్ అవాయిడెన్స్ కెమెరాను ఏర్పాటు చేశారు.
చంద్రుడిపై ఉన్న మట్టి నమూనాలను సేకరించి, ఆ సమాచారాన్ని భూమిపైకి పంపిస్తుంది. దీంతో చంద్రుడిపై ఉన్న ఖనిజాలకు సంబంధించిన వివరాలు అందుతాయి.
రోవర్‌లో ఉండే స్మార్ట్ కెమెరాల ఆధారంగా రోవర్ దాని 3డీ మోడల్‌ను తయారు చేసుకుంటుంది. దీని ఆధారంగానే ప్రయణిస్తుంది