దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ అదిరిపోయే ఆఫర్స్‌ను అందించనుంది. కొన్ని కంపెనీలు ఈ సేల్‌లోనే కొత్త ప్రొడక్ట్స్‌ను తీసుకొస్తున్నాయి.
మరీ ముఖ్యంగా స్మార్ట్ టీవీలపై ఈ సేల్‌లో ఊహకందని డీల్స్ అందిస్తున్నారు. తక్కువ ధరలోనే స్మార్ట్ టీవీలను సొంతం చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు.
ఇందులో భాగంగా బ్లాంపక్ట్ అనే కంపెనీ తమ బ్రాండ్‌పై భారీ డిస్కౌంట్‌ను అందిస్తోంది. ఈ సేల్‌లోనే ఆఫర్స్‌ను లాంచ్ చేయనున్నారు.
బ్లాపంక్ట్ బ్రాండ్ 24 ఇంచెస్ ఎల్‌ఈడీ స్మార్ట్ టీవీని కేవలం రూ. 5999కే సొంతం చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు.
ఇక 43 ఇంచెస్ థామ్సన్ 4కే టీవీని రూ. 18,500కే పొందే అవకాశాన్న ఈ సేల్‌లో అందించనున్నారు.
ఇక ఈ సేల్‌లో భాగంగా కోడక్ కంపెనీ 43ఓఎల్‌ఈడీ టీవీని కూడా లాంచ్ చేయనుంది. అయితే ఈ టీవీ ధర మాత్రం ఇంకా ప్రకటించలేదు.
వీటితో పాటు మరికొన్ని స్మార్ట్ టీవీలపై కూడా అదిరిపోయే ఆఫర్లను అందిస్తున్నారు. ఏకంగా 80 శాతం డిస్కౌంట్ ఇవ్వనున్నారు.
అక్టోబర్ 8వ తేదీ నుంచి మొదలు కానున్న అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ బిగ్‌బిలియన్ సేల్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.