కాలిన ఐరన్ బాక్స్‌ను సెకన్లలో శుభ్రం ఇలా చేయండి..

10 August 2023

ఇస్త్రీ పెట్టెని ఉపయోగించినప్పుడల్లా కాలిన భాగం బట్టలకు అతుక్కుపోతుంది. దీంతో బట్టలు కూడా పాడవుతాయి.

ఒక్కసారి ఇస్త్రీ పెట్టెలో ఏదైనా కాల్త్  అతుక్కుపోతే.. అది మనకు పెద్ద సమస్యగా మారుతుంది. ఎంత ప్రయత్నించిన రాదు.

అన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత కూడా ఐరన్ బాక్స్ శుభ్రం కాకుంటే.. ఇవాళ మేము మీకు ఒక కొత్త ట్రిక్ చెబుతాం.

దీన్ని ప్రయత్నించడం ద్వారా 2 నిమిషాల్లో ఐరన్ బాక్స్ శుభ్రం అవుతుంది. ఇప్పుడు ఎలా చేయాలో తెలుసుకుందాం.

ఇస్త్రీ పెట్టెలో అంటుకున్న మురికి బయటకు రాకపోతే, మొదట కొద్దిగా వేడి చేయండి. అది వేడెక్కిన వెంటనే ఇస్త్రీ పెట్టె ఆఫ్ చేయండి.

తర్వాత అందులో పారాసిటమాల్‌ టాబ్లెట్‌ని రుద్దాలి. పారాసెటమాల్ టాబ్లెట్‌ను అంచుకు పట్టుకుని, మీ వేలు ఇస్త్రీ పెట్టెకు తాకకుండా జాగ్రత్తగా రుద్దండి.

మీరు టాబ్లెట్‌ను ఇలా రుద్దినప్పుడు, ఇస్త్రీ పెట్టెపై అంటుకున్న గుడ్డ నెమ్మదిగా కరగడం ప్రారంభమవుతుంది.

అది కరగడం ప్రారంభించినప్పుడు, మరొక గుడ్డతో దాని మురికిని వదిలించుకోండి. క్షణాల్లో మురికి అంతా బయటకు వస్తుంది.