అమెజాన్‌ సేల్‌లో స్మార్ట్‌ ఫోన్స్‌ చవక .. బెస్ట్ డీల్స్‌ ఇవే 

Narender Vaitla

18 September 2024

షావోమీ14 స్మార్ట్ ఫోన్‌పై కూడా అమెజాన్‌ సేల్‌లో మంచి డిస్కౌంట్‌ లభిస్తోంది. ఈ ఫోన్‌ను ఆఫర్‌లో భాగంగా రూ. 47,999కి సొంతం చేసుకోవచ్చు. ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 50 ఎంపీతో కూడిన రెయిర్‌ కెమెరాను ఇచ్చారు.

అమెజాన్‌ సేల్‌లో భాగంగా సామ్‌సంగ్ గ్యాలక్సీ ఎస్‌21 ఎఫ్‌ఈ స్మార్ట్ ఫోన్‌పై మంచి డిస్కౌంట్‌ లభిస్తోంది. ఈ ఫోన్‌ను ఆఫర్‌లో భాగంగా రూ. 25,749కి సొంతం చేసుకోవచ్చు. ఇందులో 12 ఎంపీతో కూడిన కెమెరాను ఇచ్చారు. 

రెడ్‌మీ 13సీ 5జీ ఫోన్‌పై ఆఫర్లన్నీ కలుపుకొని రూ. 9,199కే లభిస్తోంది. ఈ ఫోన్‌లో 50 ఎంపీతో కూడిన కెమెరాను అందించారు. అలాగే ఈ ఫోన్‌లో 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు. 

ఈ సేల్‌లో తక్కువ ధరకే సొంతం చేసుకునే మరో స్మార్ట్‌ ఫోన్‌ రియల్‌మీ నార్జో ఎన్‌63. ఈ స్మార్ట్ ఫోన్‌ను ఆఫర్‌లో భాగంగా రూ. 7,155కే సొంతం చేసుకోవచ్చు. ఇందులో 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీతో పాటు మరెన్నో మంచి ఫీచర్లను అందించారు.

పోకో ఎక్స్‌6 5జీ స్మార్ట్‌ ఫోన్‌పై అమెజాన్‌ సేల్‌లో మంచి ఆఫర్‌ లభిస్తోంది. డిస్కౌంట్‌లో భాగంగా ఈ ఫోన్‌ను రూ. 14,999కే సొంతం చేసుకోవచ్చు. ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 64 ఎంపీతో కూడిన రెయిర్‌ కెమెరాతో పాటు మరికొన్ని ఇంట్రెస్టింగ్ ఫీచర్లను అందించారు. 

వన్‌ప్లస్ నార్డ్‌ సీఈ3 5జీ ఫోన్‌పై అమెజాన్‌ సేల్‌లో భారీ డిస్కౌంట్‌ లభిస్తోంది. ఆఫర్లన్నీ కలుపుకొని ఈ ఫోన్‌ను రూ. 16,749కి సొంతం చేసుకోవచ్చు. ఇందులో 50 ఎంతపీతో కూడిన రెయిర్‌ కెమెరాను, 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు.

ఈ సేల్‌లో లభిస్తున్న మరో బెస్ట్‌ డీల్‌ లావా బ్లేజ్‌3 5జీ ఫోన్‌. ఈ ఫోన్‌లో 50 ఎంపీతో కూడిన రెయిర్‌ కెమెరాను ఇచ్చారు. మీడియాటెక్‌ డీ6300 ప్రాసెసర్‌తో ఈ ఫోన్‌ పనిచేస్తుంది. ఇక ఆఫర్‌లో భాగంగా ఈ ఫోన్‌ను రూ. 9899కే సొంతం చేసుకోవచ్చు. 

అమెజాన్‌ సేల్‌లో లభిస్తోన్న మరో బెస్ట్ ఆప్షన్‌ ఐక్యూ జెడ్‌9 5జీ ఫోన్‌. ఈ ఫోన్‌ ఆఫర్‌లో భాగంగా రూ. 15,999కే లభిస్తోంది. ఇందులో 1800 నిట్స్‌ డిస్‌ప్లేతో కూడిన స్క్రీన్‌, సోనీ IMX882 కెమెరాను అందించారు.