11 April 2024
TV9 Telugu
యాపిల్ సంస్థ(Apple) తమ ఫోన్లు వాడుతున్న వారికి తాజాగా వార్నింగ్ ఇచ్చింది. జాగ్రత్తగా ఉండాలని కోరింది.
భారతదేశంలో పాటు మొత్తం 92 దేశాల్లో ఉన్న యాపిల్ ఫోన్ వినియోగదారులకు సంస్థ హెచ్చరికను జారీచేసింది.
మెర్సినరీ స్పైవేర్‌తో అటాక్ జరిగే ప్రమాదం ఉందని హెచ్చరిస్తూ.. నోటిఫికేషన్‌లో యాపిల్ సంస్థ వెల్లడించింది.
మీరు మెర్సినరీ స్పైవేర్ బాధితులు అయి ఉంటారని ఆ నోటిఫికేషన్‌లో పేర్కొంది యాపిల్ సంస్థ.
ఐఫోన్‌లను హ్యాక్ చేసేందుకు హ్యాకర్లు ప్రయత్నిస్తుంటారని, బుధవారం రాత్రి ఈ మెయిల్ ద్వారా ఆ నోటిఫికేషన్ పంపారు.
యాపిల్ సంస్థ తన ప్రకటనలో పెగాసస్ స్పైవేర్ గురించి కూడా ప్రస్తావిస్తూ హెచ్చరిక జారీ చేసింది.
ప్రభుత్వాలు, పెగాసిస్ లాంటి స్పైవేర్‌ను డెవలప్ చేస్తున్న సంస్థలు దాడులకు పాల్పడే అవకాశాలు
విపక్ష నేతల్ని టార్గెట్ చేస్తున్న భారత్‌లో ఆ స్పైవేర్ గురించి 2021లో పెను దుమారం చెలరేగిన విషయం తెలిసిందే.