చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం ఐకూ ఫోన్‌ను ఇటీవల మార్కెట్లోకి తీసుకొచ్చింది. అయితే తాజాగా ఈ ఫోన్‌పై భారీ డిస్కౌంట్ లభిస్తోంది.
ఈ కామర్స్ సంస్థ అమెజాన్‌లో ఈ ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌ను అందస్తోంది. ఏకంగా 45 శాతం డిస్కౌంట్ లభిస్తోంది. ఈ ఫోన్ అసలు ధర రూ. 19,999కాగా.
45 శాతం డిస్కౌంట్‌లో భాగంగా ఈ స్మార్ట్ ఫోన్‌ను రూ. 10,999కి సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్‌ను 6GB RAM, 128GB స్టోరేజ్ వేరియంట్‌తో తీసుకొచ్చారు.
ఈ ఫోన్‌లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 1 ప్రాసెసర్‌ను తీసుకొచ్చారు. ఇక ఇందులో 120Hz రిఫ్రెష్ రేట్‌తో కూడిన ఫుల్‌హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు.
ఇక ఈ ఫోన్‌లో 5000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని అందించారు. కనెక్టివిటీ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో బ్లూటూత్, వైఫై, యూఎస్‌బీ కనెక్టివిటీ వంటి ఫీచర్లను అందించారు.
కెమెరా విషయానికొస్తే ఈ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 ఎంపీతో కూడిన ఫ్రంట్ కెమెరాను ఇచ్చారు.
అలాగే ఈ ఫోన్‌లో ఐ ఆటో ఫోకస్ అనే ఫీచర్‌ను ప్రత్యేకంగా అందించారు. ఈ ఫోన్‌ను 8.25mm మందం, 194 గ్రాముల బరువు ఉంటుంది.