ఓవర్‌హీట్ యమ డేంజర్.. మీ స్మార్ట్‌ఫోన్‌ను కూల్‌గా ఉంచే టిప్స్!
June 03, 2024
TV9 Telugu
TV9 Telugu
వాతావరణంలో అధిక ఉష్ణోగ్రతల వల్ల స్మార్ట్ఫోన్లు, ఎయిర్ కండీషనర్లు వంటి ఎలక్ట్రానిక్ ఉపకరణాలు వేడెక్కుతుంటాయి
TV9 Telugu
ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలతో పాటు, రోజువారీ పనులు, కాలింగ్, గేమింగ్, స్ట్రీమింగ్, మరెన్నో కారణాలతో మన స్మార్ట్ఫోన్లు గరిష్ట వినియోగంలో ఉంటాయి
TV9 Telugu
అందుకే.. ఈ మధ్య కాలంలో స్మార్ట్ఫోన్లు ఓవర్ హీట్ అయ్యి పేలిపోతున్న కేసులు పెరుగుతున్నాయి. అయితే మీ ఫోన్ వేడెక్కకుండా ఉండేందుకు ఫోన్ కూలింగ్ టిప్స్ ఇక్కడ తెలుసుకోంది
TV9 Telugu
వేసవిలో డివైజ్‌ను ఛార్జింగ్ చేసేటప్పుడు మీ స్మార్టఫోన్ కేస్‌ను తొలగించడం మర్చిపోకూడదు. నేటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కారణంగా స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్‌లో ఉంచినప్పుడు వేడెక్కుతుంది
TV9 Telugu
అందువల్ల ఫోన్ కేస్‌ను తొలగించడం వల్ల డివైజ్ హీట్ మెయింటైన్ చేస్తుంది. అలాగే వేసవిలో తగిన టెంపరేచర్ మెయింటైన్ చేయడానికి మినిమమ్ డిస్ప్లే బ్రైట్నెస్ ఉపయోగించాలి
TV9 Telugu
అధిక ప్రకాశంతో ఉంటే, డివైజ్ హీట్ఎక్కొచ్చు. ఇది పనితీరును కూడా ప్రభావితం చేస్తుంది. ఆరుబయట ఉంటే స్మార్ట్‌ఫోన్‌ను ప్రత్యక్ష సూర్యకాంతిలో ఉపయోగించకపోవడం మంచిది
TV9 Telugu
స్మార్ట్ఫోన్అధిక వినియోగాన్ని తగ్గించాలి. ఎక్కువసేపు గేమ్స్ ఆడటం వల్ల స్మార్ట్‌ఫోన్ ఓవర్‌హీట్ అవుతుంది. ఆరుబయట కాకుండా ఇంటి లోపల గేమ్స్ఆడేందుకు ప్రయత్నించాలి
TV9 Telugu
మీ స్మార్ట్‌ఫోన్‌ను జేబుల్లో ఉంచుకోకూడదు. ఎందుకంటే ఇది గాలి ప్రసరణను ట్రాప్ చేసి హీటెక్కించే ఛాన్స్ ఉంది. అందుకే స్మార్ట్‌ఫోన్‌ను ఎల్లప్పుడు ఓపెన్ ఏరియాలో ఉంచాలి