నానితో ఒక్క సినిమా కూడా చేయని హీరోయిన్.. ఇప్పుడు స్పెషల్ సాంగ్..

Rajitha Chanti

Pic credit - Instagram

20 January 2026

న్యాచురల్ స్టార్ నాని ఇప్పుడు ప్యారడైజ్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో ఓ స్పెషల్ సాంగ్ ఉంటుందని.. గ్లామరస్ క్వీన్ నటించనుందట.

ఆమె మరెవరో కాదు.. మిల్కీబ్యూటీ తమన్నా. ప్రస్తుతం తెలుగు , హిందీ భాషలలో కథానాయికగా కంటే ఎక్కువగా గ్లామర్ పాటలతోనే బిజీగా ఉంది తమన్నా.

ముఖ్యంగా ఆమె చేసిన స్పెషల్ సాంగ్స్ యూట్యూబ్ ను ఊపేస్తున్నాయి. ఇప్పుడు ప్యారడైజ్ చిత్రంలోనూ ఈ అమ్మడు నానితో కలిసి స్టెప్పులేయనుందట.

ఇదిలా ఉంటే.. ఇప్పటివరకు నాని, తమన్నా కలిసి ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా చేయలేదు. కానీ మొదటిసారి ప్యారడైజ్ చిత్రంలో కలిసి కనిపించనున్నారు.

గత కొన్ని రోజులుగా ప్యారడైజ్ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతుంది. ఈ చిత్రాన్ని ఈ ఏడాది వేసవిలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. 

మరోవైపు తమన్నా తెలుగులో సినిమాలు చేయడం లేదు. అటు ఓటీటీలలో వెబ్ సిరీస్.. ఇటు సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేస్తూ ఫుల్ బిజీగా ఉంటుంది.

అలాగే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం ఏదోక పోస్ట్ చేస్తూ సందడి చేస్తుంది. ఇటీవల ఆమె నటించిన ఆజ్ కీ రాత్ సాంగ్ సంచలనంగా మారింది.

తమన్నా ఎనర్జీ, గ్లామరస్ లుక్స్, డ్యాన్స్ స్టెప్స్ నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. ఇప్పుడు తెలుగులో నాని సరసన గ్లామరస్ పాటలో కనిపించనుంది తమన్నా.