సానియా, షోయబ్ విడాకులు.. మళ్లీ వార్త వైరల్..
5 August 2023
సానియా మీర్జా, షోయబ్ మాలిక్ విడాకుల గురించి మరోసారి ఊహాగానాలు మొదలయ్యాయి.
గత ఏడాది నుంచి వీరిద్దరి విడాకుల చర్చ సోషల్ మీడియాలో జోరుగా సాగుతుంది.
అయితే దీని గురించి వీరిద్దరు నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందించలేదు.
కాగా ఈ ఊహాగానాల మధ్యే వీరిద్దరు ‘ది మీర్జా మాలిక్ షో’ అనే ఓ పాకిస్థాన్ రియాల్టీ షోకు వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు.
2010లో వివాహం చేసుకున్న వీరికి ఇజ్హాన్ మాలిక్ అనే కుమారుడు ఉన్నాడు.
అయితే శుక్రవారం షోయబ్ తన ఇన్స్టాలో ‘‘సూపర్ వుమన్ సానియా మీర్జా భర్త’’ అని ఉన్న బయోని తొలగించాడు.
సానియా కూడా తన ఇన్స్టాగ్రామ్ ఖాతా నుంచి షోయబ్ ఫొటోల్ని డిలీట్ చేసింది.
దీంతో వీరి విడాకులపై ఊహాగానాలు మరోసారి జోరందుకున్నాయి.
ఇక్కడ క్లిక్ చెయ్యండి