28 August 2023
Pic credit - Instagram
నీరజ్ చోప్రా శిక్షణ కోసం రూ.7 కోట్లు ఖర్చు చేశారు. ఆ తర్వాత టోక్యో ఒలింపిక్స్‌లో దేశ కోసం స్వర్ణం సాధించాడు.
టోక్యో తరువాత, బుడాపెస్ట్ వరకు ప్రయాణంలో కూడా నీరజ్ శిక్షణ కోసం ప్రభుత్వ ఖజానా నుంచి భారీ మొత్తం ఖర్చు చేశారు.
నీరజ్ చోప్రా అమెరికా, ఫిన్లాండ్, టర్కీ వంటి దేశాల్లో శిక్షణ పొందాడు. శిక్షణలో చెమటలు చిందించి, గోల్డెన్ మెడల్ ఒడిసిపట్టాడు.
2021-2022 సంవత్సరంలో నీరజ్ చోప్రా అమెరికాలో 3 నెలల శిక్షణా శిబిరాన్ని నిర్వహించారు. దీని కోసం రూ. 38 లక్షలు ఖర్చు చేశారు.
గత సంవత్సరం, నీరజ్ ఫిన్లాండ్‌లో 4 వారాల పాటు శిక్షణ పొందాడు. అందుకోసం దాదాపు రూ. 9.8 లక్షలు ఖర్చయ్యాయి.
ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ 2023 కోసం సిద్ధం కావడానికి, నీరజ్ టర్కీకి వెళ్లాడు. అక్కడ 44 రోజుల శిబిరం జరిగింది. నివేదిక ప్రకారం, నీరజ్‌పై ప్రతిరోజూ ఇక్కడ చేసిన ఖర్చు రూ.50,000లు.
నీరజ్ టర్కీలో తన శిక్షణా రోజులను మరికొంత పొడిగించగా, దానికి కూడా ప్రభుత్వం మరో రూ. 5.5 లక్షలు అందించింది.