ఈ ఆలయాల్లో టన్నుల కొద్దీ బంగారం.. ఎంత తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
TV9 Telugu
29 October 2024
ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన దేవాలయాలలో భారతదేశంలోని అనేక దేవాలయాలు ఉన్నాయని చాల సర్వేలు చెబుతున్నాయి.
భారతదేశంలో ప్రసిద్ధిగాంచిన అనేక పురాతన దేవాలయాలలో సంపద బంగారం రూపంలో ఉందని ఎంతో మంది చెబుతుంటే విన్నాం.
భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఉన్న దేవాలయాల్లో మొత్తం సుమారు 4,000 టన్నుల బంగారం ఉంటుందని నిపుణుల అంచనా.
కేరళలోని శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయం నేలమాళిగల్లో వజ్రాలు, బంగారు అభరణాలు, విగ్రహాలను ఉంచారని అంచనా.
కేరళ రాజధాని తిరువనంతపురంలో అనంత పద్మనాభ స్వామి దేవాలయంలో మొత్తం 13 టన్నుల బంగారం ఉందని చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో 10.3 టన్నుల బంగారం ఉందని చెబుతున్నారు.
జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఉన్న వైష్ణో దేవి ఆలయంలో కూడా 1.2 టన్నుల బంగారం ఉన్నట్లు చరిత్రకారుల అంచనా.
మహారాష్ట్ర రాష్ట్రంలోని షిరిడి సాయిబాబా ఆలయంలో కూడా 376 కేజీల బంగారం అందని చెబుతున్నారు కొందరు నిపుణులు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి