పిల్లలతో సరస్వతి దేవికి ఇలా పూజ చేస్తే విద్యలో పురోగతి.. 

08 July 2025

Prudvi Battula 

ప్రస్తుత కాలంలో చదువులో ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థులకు, వారి ఉత్తీర్ణత శాతం పెంచడానికి, ఈ పూజ చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

పిల్లలను ముందుగా శుచిగా ఉంచుకుని, తలస్నానం చేయించాలి. వారి పుస్తకాలకు పసుపుతో శ్రీకారం చుట్టి, కలబపూలతో పూజ చేయాలి.

సరస్వతి దేవికి తెల్లని పూలు ఎంతో ఇష్టం. కాబట్టి, తెల్లని పూలతో పూజ చేయాలి. ధూపం వేయడం, నీరాజనం ఇవ్వడం కూడా చేయాలి.

మంచి బుద్ధి, ఏకాగ్రత, ఆలోచనాశక్తి, సంభాషణ చాతుర్యం కోసం అమ్మవారిని ప్రార్థించాలి. కొబ్బరికాయను నివేదనగా సమర్పించాలి.

ఈ పూజ పిల్లలలోని బద్ధకాన్ని, దుర్గుణాలను తొలగించి, చదువులో మంచి ఆసక్తిని కలిగిస్తుంది. వారి గ్రహణశక్తిని పెంచి, పరీక్షల్లో మంచి మార్కులు సాధించడానికి సహాయపడుతుంది.

పిల్లలు తమ పుస్తకాలను సరస్వతి దేవిగా భావించి పూజ చేయడం ద్వారా అమ్మవారి అనుగ్రహాన్ని పొందవచ్చు అంటున్నరు పండితులు.

ఈ విధంగా పిల్లలతో కలిసి చేసే ఈ సరళమైన సరస్వతి దేవి పూజ, వారి భవిష్యత్తులో విజయవంతం కావడానికి దోహదం చేస్తుంది.

మూలా నక్షత్రం రోజున, ముఖ్యంగా ఆశ్వీజ శుద్ధ సప్తమి మంగళవారం రోజున, సరస్వతి దేవి పూజ చేయాలి. లేదా మీకు కుదిరానప్పుడు కూడా చేయవచ్చు.