చనిపోయాక కాలి బొటన వేళ్లను ఎందుకు కట్టేస్తారు..

మనిషి చనిపోయిన తర్వాత వారి కాళ్ళ బొటని వేళ్ళని కట్టడం వెనక కారణం ఏమిటంటే..?

మనిషి చనిపోయాక కాళ్ళు బొటని వేళ్ళని రెండు కూడా ఒక దారంతో కడతారు.

ఎవరైనా చనిపోయిన తర్వాత వాళ్ళ శరీరం నుండి ఆత్మ వేరేగా వెళ్ళి పోతుంది.

అయితే మనిషి చనిపోయాక కూడా ఆత్మ ఇంకా బతకాలి..,

అందరితో ఉండాలని తాపత్రయ పడుతుంది.. శవం లోకి వెళ్లి మళ్లీ ఇంట్లోకి వెళ్లిపోవడానికి చూస్తుంది.

అలా ప్రయత్నం చేసినప్పుడు కాళ్ళని కదలకుండా ఉంచేందుకు ఒక తాడుని కానీ ఒక దారాన్నికానీ కడతారు.

అయితే దీని వెనక ఒక లాజిక్‌ కూడా ఉంది. చనిపోయాక శరీరం బిగుసుకుపోతుంది.

అప్పుడు చలనం ఉండదు కాబట్టి కాల్లు పక్కకి పడిపోతాయి.

అలా జరగకుండా ఉండేందుకు రెండు కాళ్ళ బొటన వేళ్ళని ఒక దారంతో కడతారు.

ఈ పద్దతిని పాటించడానికి కారణం ఇదే.