ఏ రాశి వారికి ఏ రంగు రాఖీ  కట్టాలంటే.?

TV9 Telugu

16 August 2024

మేష రాశి: మేశ రాశి వారి జాతకంలో కుజుడు బలపడాలంటే ఎరుపు రంగు రాఖీని కట్టడం మంచిదంటున్నారు హిందూ పండితులు.

వృషభ రాశి: వృషభ రాశి వారి జాతకంలో శుక్రుడు బలపడాలంటే తెలుపు రంగు రాఖీని కట్టాలంటున్నారు భారతీయ పండితులు.

మిథున రాశి: మిథున రాశి వారి జాతకంలో బుధ గ్రహం బలపడాలంటే ఆకుపచ్చ రంగు రాఖీ కట్టాలని పండితులు చెబుతున్నారు.

కర్కాటక రాశి: ఈ రాశి వారి జాతకంలో చంద్రుడు బలపడాలంటే తెలుపు రంగు రాఖీ కట్టడం ఉత్తమమని పండితులు చెబుతున్నారు.

సింహ రాశి: ఈ రాశి వారి జాతకంలో సూర్యుడు బలపడాలంటే పసుపు లేదా ఎరుపు రంగు రాఖీ కడితే మంచిదంటున్నారు పండితులు.

కన్య రాశి: ఈ రాశి వారి జాతకంలో బుధ గ్రహం బలపడాలంటే పచ్చ రంగు రాఖీ కట్టడం మంచిదని అంటున్నారు పండితులు.

తులా రాశి: ఈ రాశి వారి జాతకంలో శుక్రుడు, చంద్రుడు బలపడాలంటే తెలుపు రంగు రాఖీ కట్టాలని పండితులు చెబుతున్నారు.

వృశ్చిక రాశి: ఈ రాశి వారి జాతకంలో కుజ గ్రహం బలపడాలంటే వారికి ఎరుపు రంగు రాఖీని కడితే మంచిదంటున్నారు పండితులు.

ధనుస్సు రాశి: ఈ రాశి వారి జాతకంలో కుజుడు బలపడాలంటే పసుపు రంగు రాఖీని కట్టాలని పండితులు చెబుతున్నారు.

మకర రాశి: ఈ రాశి వారి జాతకంలో శని గ్రాహం బలపడి శుభాలు జరగాలంటే నీలం రంగు రాఖీ కట్టాలంటున్నారు పండితులు.

కుంభ రాశి: ఈ రాశి వారి జాతకంలో శని గ్రాహం బలపడాలంటే ఆకాశ నీలి రంగు రాఖీ కట్టాలని చెబుతున్నారు పండితులు.

మీన రాశి: ఈ రాశి జాతకంలో కుజుడు బలపడాలంటే వారికి పసుపు రంగు రాఖీ కట్టాలంటున్నారు భారతీయ హిందూ పండితులు.