హిందూ పురాణాల్లో జ్యోతిర్లింగాలకు ప్రత్యేకత ఉంటుంది. శివపురాణ ప్రకారం 64 జ్యోతిర్లింగాల్లో 12 చాలా పవిత్రమైనవి. వీటిని మహాజ్యోతిర్లింగాలుగా పిలుస్తారు. మన దేశంలో ఇవి ఎక్కడెక్కడ ఉన్నాయో చూద్దాం.
గుజరాత్ రాష్ట్రంలోని సౌరాష్ట్ర జిల్లాలో సోమనాథేశ్వరం క్షేత్రంలో సోమనాధ జ్యోతిర్లింగం ఒకటి ఉంది. పవిత్ర పుణ్యక్షేత్రాల్లో ఇదొకటి.
ఏపీలోని కర్నూల్ జిల్లా దగ్గరిలో అందమైన నల్లమల కొండలలో శ్రీశైలంలో మల్లికార్జున జ్యోతిర్లింగా ఆ పరమ శివుడు భక్తులకు దర్శనం ఇస్తారు .
మధ్యప్రదేశ్ నర్మదా నది ద్వీపంలో ఓంకారేశ్వర జ్యోతిర్లింగ, మధ్యప్రదేశ్ ఉజ్జయినీలో మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగం ఉంది.వారణాసిలో కాశీ విశ్వనాథ్ జ్యోతిర్లింగం ఉంది, ఇది గంగానది ఒడ్డున ఉంటుంది.
మహారాష్ట్రలో వైద్యనాథ్ జ్యోతిర్లింగంగా పరమశివుడు దర్శనం ఇస్తారు. అక్కడి ప్రజలు ఆ లింగాన్ని అమృతేశ్వరుడు అని పిలుస్తారు. అమృతాన్ని లింగంలో దాచారని వారి నమ్మకం.
హిమాలయాల మంచుతో కప్పబడి, శిఖరాల మధ్య ఉన్న కేదార్ నాథ్ చాలా సుందరమైన ప్రదేశం. ఇది యాత్రికులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.
ఎల్లోరా గుహల సమీపంలో మహారాష్ట్రలో గ్రిష్ణేశ్వర్ జ్యోతిర్లంగం, అలాగే మహారాష్ట్రలో త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం ఉంది. ఇది బ్రహ్మ, విష్ణువు, శివుడిని సూచిస్తుంది.
గుజరాత్ ద్వారకలో నాగేశ్ర్ జ్యోతిర్లింగం రూపంలో శివుని భారీ విగ్రహం దర్శనం ఇస్తుంది. అలాగే తమిళనాడులో రామేశ్వరం ద్వీపంలో జ్యోతిర్లింగం దర్శనం ఇస్తుంది