సోదరి కట్టిన రాఖి ఎప్పుడు తొలగించాలి.?

TV9 Telugu

18 August 2024

నిజానికి రక్షా బంధన్ పండుగను జన్మాష్టమి వరకు జరుపుకుంటారు. కుటుంబానికి దూరంగా నివసించే వారు జన్మాష్టమి వరకు రాఖీ కట్టవచ్చు.

రక్షా బంధన్‎ను వివిధ సంప్రదాయాల ప్రకారం జరుపుకుంటారు. చాలా చోట్ల, సోదరీమణులు సోదరుడికి తిలకం పెట్టిన తర్వాత రాఖీ కట్టి కొబ్బరికాయను ఇస్తారు.

ఆ తర్వాత సోదరుడి తిలకం పెట్టి తర్వాత రాఖీ కట్టి హారతి చేస్తారు. దీని తరువాత సోదరుడు తన సోదరి పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకొని సోదరికి బహుమతిగా ఇస్తాడు.

కొబ్బరికాయ లక్ష్మీ దేవి చిహ్నంగా భావిస్తారు. అందుకే చాలా చోట్ల ఈ రోజున సోదరీమణులు సోదరుడికి కొబ్బరికాయను నైవేద్యంగా ఇస్తారు.

రక్షా బంధన్ నాడు రాఖీ కట్టిన తర్వాత కనీసం జన్మాష్టమి వరకు అయినా ఉంచుకోవాలని హిందూ పండితులు చెబుతున్నారు.

రాఖీ రంగు విషయానికి వస్తే నలుపు లేదా నీలం రంగులో ఉండకుండ ఎరుపు లేదా పసుపు రంగులో ఉండేలి.  దాని రక్షణ దారం పట్టుతో ఉండాలి.

జన్మాష్టమి నాడు రాఖీని తొలగించి ఎక్కడైనా చెట్టు దగ్గర లేదా ప్రవహించే నీటిలో వేయండి. రాఖీని ఎక్కడంటే అక్కడ విసిరేయకూడదు.

రాఖీని ఎక్కువ రోజులు చేతికి ఉంచుకోకూడదు. ఒక వేళ చేతికి ఉన్నప్పుడే విరిగిపోతే ఎరుపు రంగు వస్త్రంలో చుట్టి పూజ గదిలో ఉంచాలి లేదంటే నీటిలో విడిచిపెట్టాలి.