వినాయక చవితి చాటి చెప్పే సందేశం..
30 August 2024
Battula Prudvi
వినాయక చవితి సందర్భంగా విగ్రహాల తయారీ, వాహనాలు, క్రేన్లు, మండపాల ఏర్పాటు, అలంకరణ, బ్యాండ్ బృందాలపై ఆధారపడి కోట్ల మందికి మేలు జరుగుతుంది.
విగ్రహాల తయారీదారులు ఆరు నెలల నెలల ముందే పని ప్రారంభించగా కొందరు మాత్రం ఏడాది పొడవునా అదే పనిలో ఉంటారు.
వినాయక చవితి సందర్భంగా గత ఏడాది రూ.300 కోట్లపైగా వ్యాపారం జరిగింది. ఈ ఏడాది మరింత పెరిగే అవకాశం ఉంది.
వినాయక చవితి వేడుకలు ప్రజల్లో ఐక్యతను పెచ్చడమే మాత్రమే కాదు బాధ్యతలను, సేవా భావాన్ని చాటి చెబుతాయి.
దేశవ్యాప్తంగా వీధివీధిలో మండపాలు వేసి అంతా కలిసి మెలిసి పండగ చేసుకుంటారు. దీంతో ప్రజల్లో స్నేహానుబంధం పెరుగుతుంది.
విగ్రహ ప్రతిష్ఠాపన మొదలు నిమజ్జనం వరకు ప్రతి రోజూ పూజలు చేస్తూ బాధలన్నీ మరచి ప్రజలంతా కలిసి సొంతోషంగా ఉంటారు.
వినాయక చవితి వేడుకల సమయంలో చేసిన అన్నదానం వల్ల ఎంతో మంది పేదవారి ఆకలి తీరుతుంది. ఇలా సేవ చేసే మార్గం కూడా ఉంటుంది.
విఘ్నాలను దూరం చేసి సకల శుభాలనూ ప్రసాదించే విగ్నేశ్వరుడి పండగ పూర్తిగా పర్యావరణ హితంగా జరగాలని అందరి ఆకాంక్ష.
ఇక్కడ క్లిక్ చెయ్యండి