03 March 2024
TV9 Telugu
Pic credit - Pexels
హిందూ సనాతన ధర్మం .. మతపరమైన దృక్కోణంలో చూస్తే తులసి వాడిపోవడం అశుభకరమైనదిగా పరిగణించబడుతుంది. తులసి మొక్క ఎండిపోవడం వలన ఇంట్లోకి ప్రతికూల శక్తి వస్తుంది.
హటాత్తుగా తులసి మొక్క ఎండిపోతే అది ఇంట్లో వచ్చే సమస్యలకు సంకేతమట. వ్యక్తి శరీరంలో కొన్ని సామాజిక, ఆర్థిక లేదా వ్యాధి వంటి సమస్యను సూచిస్తుంది
హిందూ మతంలో తులసి మొక్కను శ్రీ మహా విష్ణువు గానే కాదు లక్ష్మీదేవి రూపంగా పరిగణిస్తారు. పూజిస్తారు. అయితే ఈ తులసి మొక్క ఎండిపోవడం విచారకరమైన వార్త.
ఇంట్లో తులసి వాడిపోయినా నిద్రపోయినా అ శుభంగా పరిగణిస్తారు. అంతేకాదు ఇంట్లోని వ్యక్తులకు ఆర్థిక నష్టం కలిగిస్తుంది. మహిళలు ఎన్నో కష్టాలను కూడా భరించాల్సి స్తుంది.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం తులసి బుధ గ్రహానికి సంబంధించినది. తులసి మొక్క ఎండిపోవడం ప్రారంభిస్తే బుధ గ్రహం మీపై చెడు ప్రభావాన్ని చూపుతుందని అర్థం చేసుకోండి.
తులసి మొక్క ఎండిపోతే ఆ కుటుంబంలో ఇబ్బందులు ఏర్పడతాయి. అంతేకాదు కొన్ని రకాల వ్యాధికి సంకేతంగా కనిపిస్తుంది. అంతే కాకుండా ధన నష్టం కూడా జరుగుతుంది.
తులసిని ఎప్పటికప్పుడు జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం, తద్వారా అది ఆరోగ్యంగా , పచ్చగా ఉంటుంది. దీంతో మీ జీవితం ఎప్పుడూ ఆనందంతో నిండి ఉంటుంది.