మణికట్టుకి రక్షతాడు ఎందుకు కడతారు.? దీని వెనుక ఉన్న సైన్స్ ఏంటి.? 

Battula Prudvi

26 October 2024

హిందువులు నమ్మకంగా పాటించే ఎన్నో సంప్రదాయాల వెనుక ఓ సైంటిఫిక్ కారణం దాగి ఉంటుంది. వాటిలో మణికట్టు రక్షతాడు కూడా ఒకటి.

మానవుల మణికట్టు వద్ద సిరలు మరియు ధమనులు కలిసి ఉంటాయి. ఈ కారణంగానే పూర్వం వైద్యులు మణికట్టు పట్టుకొని వ్యాధి ఏంటో చెప్పేవారు.

మణికట్టు వద్ద సిరలు మరియు ధమనులు కలిసే ప్రదేశాన్ని ప్రెజర్ పాయింట్స్ అంటారు. వీటి ద్వారా వ్యాధి గురించి తెలుసుకోవచ్చు.

ఈ ప్రెజర్ పాయింట్స్ ప్రదేశంలో రక్షతాడు కడితే వీటి బ్యాలన్స్ చేసి గుండె జబ్బులు, రక్తపోటు, పక్షవాతం వ్యాధులు రాకుండా కాపాడుతుంది.

మణికట్టుకి రక్షతాడు కట్టుకోవడానికి కూడా హిందూ ధర్మంలో కొన్ని నియమాలు ఉన్నాయి. వాటి గురించి కూడా తెలుసుకుందాం.

హిందూ నమ్మకాల ప్రకారం మగవారు, పెళ్లికాని మహిళలు ఇద్దరు కూడా రక్షతాడును కుడి చేతి మణికట్టుకు కట్టుకోవచ్చు.

అయితే గర్భిణీలు మాత్రం ఎడమ చేతి మణికట్టుకి కట్టుకోవాలి. గర్భంలో శిశువుకి ఎలాంటి సమస్య రాకూడదని ఇలా కట్టుకోవాలి.

మణికట్టుకి కట్టుకొనే రక్షతాడు హిందువుల సంప్రదాయం మాత్రమే కాదు దీని వెనుక చాలామందికి తెలియని సైన్స్ దాగి ఉంది.