ఉత్తరాంధ్రుల ఆరాధ్య తలుపులమ్మ చరిత్ర తెలుసా..
TV9 Telugu
03 October 2024
తలుపులమ్మ లోవా టెంపుల్ గోదావరి సహజ సౌందర్యానికి ఒక నమూనాగా ఉన్న కొండలు, లోయల మధ్య చాలా ప్రశాంతమైన, అందమైన వాతావరణంలో ఉంది.
అగస్త్య ముని ఈ కొండల్లో ధ్యానం చేస్తూ ఇక్కడ పండ్లను తిని, నీటిని తాగేవాడని, అందుకే వాటికి వరుసగా దారకొండ, తీగకొండ అని పేర్లు పెట్టారని నమ్ముతారు.
దారకొండ నుంచి ఎప్పుడు అంతరాయం లేకుండా నీటి ప్రవాహం ఉంటుంది. ఇది ఎక్కడనుంచి వస్తుందో, తరుచూ నీరు ఉండటానికి కారణం మాత్రం ఓ మిస్టరీ.
స్వయంభు వెలిసిన ఇక్కడ అమ్మవారిని తలుపులమ్మ తల్లి అని పిలుస్తారు. ఎందుకంటే భక్తులకు వరాలు ఇవ్వడానికి ఆమె యొక్క కేవలం ఆలోచన (తలపు) సరిపోతుంది.
అమ్మవారి గురించి మదిలో కేవలం ఒక్క ఆలోచన వచ్చిన వారు ఏది ప్రార్థించినా వారికి మంజూరు చేస్తుందని ఇక్కడి భక్తుల నమ్మకం.
భక్తులు ఈ ఆలయాన్ని చేరుకోవాలంటే ప్రవేశ ద్వారం నుంచి గుడి వరకు ఉన్న పొడవైన, నిటారుగా ఉండే మెట్లను ఎక్కాలి.
వాహన యజమానులు, ముఖ్యంగా గోదావరి, ఉత్తర కోస్తా జిల్లాల వారు తలుపులమ్మ తల్లి తమను ప్రమాదాల నుండి కాపాడుతుందని బలంగా విశ్వసిస్తారు.
ట్రక్కు యజమానులు కొండ గుడి పాదాల వద్ద గుడారాలు వేసుకుని జంతు బలులు అర్పించి తమ వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్లను గోడలపై అతికిస్తారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి