సనాతన ధర్మం ప్రకారం, పురాణాల ప్రకారం నరఘోష, అలాగే జ్యోతిష్యశాస్త్ర ప్రకారం దృష్టిదోషం వంటివి ఉంటాయని చెప్తున్నారు.
దీనికి ఉదాహరణగా వినాయక వ్రతకల్పంలో చంద్రుని దృష్టి వలన వినాయకుని యొక్క ఉదర భాగం పగిలి ఇబ్బందిపడినట్లుగా మనం చదువుకున్నాం.
అయితే శుభకార్యాలు ఆచరించేటప్పుడు వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఉన్నత పదవులు, ఉన్నత స్థానాలు వ్యవహరించేటప్పుడు రాజ్యాధికారం వంటి కార్యక్రమాలు చేపట్టేటప్పుడు ఈ నరఘోషలు ఉంటాయట.
సంతానం కలిగినప్పుడు పిల్లలమీద కూడా ఈ నరదిష్టి ప్రభావం ఉంటుందని శుభకార్యాలు ఆచరించేటప్పుడు ఆచరించిన తరువాత కూడా ఈ నరదిష్టి ఉంటుందట.
అయితే ఈ నరదిష్టి, నరఘోషకు సంబంధించినటువంటి పరిహారాలు ఆచరించడం సాంప్రదాయం వీటి నుండి విముక్తి పొందవచ్చని పురాణాలు చెప్తున్నాయి.
నరదిష్టి, నరఘోష తొలగడానికి నివసించే గృహాలయందు గుమ్మడి కాయలు వంటివి కట్టడం, నరఘోష యంత్రాలు వంటివి పూజించి స్థాపించుకోవడం ఒక విధానం.
శుభకార్యం ఆచరించినా కార్యక్రమానికి ముందు కార్యక్రమం అయిన తరువాత దిష్టి తీయడం విశేషంగా బూడిద గుమ్మడి కాయతో, కర్పూరం, కొబ్బరికాయతో లేదా ఉప్పు వంటి వాటితో దిష్టిని తీయడం ఒక విధానం.
నెలకొక శనివారం నిమ్మకాయ లేదా ఉప్పు లేదా ఎండు మిరపకాయలతో శనివారం రోజు స్నానానికి పూర్వం దిష్టి తీయించుకున్న తరువాత తలస్నానం ఆచరించినట్లయితే వారికి నరఘోష బాధల నుండి విముక్తి కలుగుతుందట.