నవ నరసింహ క్షేత్రాలు ఏవి.? అవి ఎక్కడ ఉన్నాయో తెలుసా.?
08 July 2025
Prudvi Battula
నవ నరసింహ క్షేత్రాల్లో మొదటది కర్నూలు జిల్లాలోని అహోబిలం నరసింహస్వామి క్షేత్రం. హిరణ్యకశిపుని సంహరించిన ప్రదేశంగా చెప్పబడుతున్న క్షేత్రం ఇది.
ఈ క్షేత్రాల్లో రెండోది యాదగిరిగుట్ట నరసింహస్వామి క్షేత్రం. యాదవ మహర్షి తపస్సుకి మెచ్చి స్వామి ప్రాంతంలో జ్వాలా నరసింహుడిగా వెలిసినట్టు స్థల పురాణం చెబుతుంది.
మూడవది గుంటూరు జిల్లాలోని మంగళగిరి పానకాల నరసింహస్వామి క్షేత్రం. ఇక్కడ స్వామికి పానకం అర్పిస్తే శుభా ఫలితాలు లభిస్తాయి.
ఇందులో నాలుగవది విశాఖపట్టణంలోని సింహాచలంలో ఉన్న వరాహలక్ష్మి నరసింహ స్వామి క్షేత్రం. ఇక్కడే స్వామి హిరణ్యాక్షుడిని సంహరించారన్నది స్థల పురాణం.
తెలంగాణలోని కరీంనగర్ సమీపంలోని ఉన్న ధర్మపురి క్షేత్రం కూడా నవ నరసింహ క్షేత్రాల్లో ఒకటిగా పరిఢవిల్లుతుంది. ఇది ఐదవది.
నవ నరసింహ క్షేత్రాల్లో ఆరవది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న వేదాద్రి. ఇది కృష్ణ నది ఒడ్డున ఉంది. ఇది ఏడవ క్షేత్రం.
గోదావరి నది ఒడ్డున ఉన్న అంతర్వేది ఈ క్షేత్రాల్లో ఏడవది. ఇది ఆంధ్రలోని అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉంది.
నవ నరసింహ క్షేత్రాల్లో ఎనిమిదవది నెల్లూరు జిల్లాలోని పెంచలకోన నరసింహ క్షేత్రం. ఈ ఆలయం పెంచలకోన లోయలోని ఒక కొండ దిగువన ఉంది.
మాలకొండ శ్రీ మాల్యాద్రి లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయ నెల్లూరు జిల్లాలోని కందుకూరు నుంచి 34 కి.మీ.ల దూరంలో ఉంది.