గోత్ర నామాలు అంటే ఏమిటి.? ఎలా వచ్చాయి.?
31-July -2023
హిందువుల్లో ప్రతి ఒక్కరికీ ఇంటి పేరుతో పాటు గోత్రనామాలు కూడా ఉంటాయి.
ఈ గోత్రనామాలు ఎక్కువగా గుడిలో.. పెళ్లి చూపుల సందర్భాల్లో వినిపిస్తుంటాయి.
అయితే అవి ఎలా పుట్టాయో ఇప్పటి యువతకు తెలియదు.
పూర్వం అందరూ గురువుల దగ్గర చదువు నేర్చుకునేవారు.
అలా విద్య నేర్పినందుకుగాను గురువుల పేరును తమ గోత్రనామంగా పెట్టుకున్నారు.
అలాగే చదువుకోని వాళ్లు తమ పూర్వీకులలో మొదటి వ్యక్తి పేరును గోత్రనామంగా పెట్టుకున్నారు.
ఇక ఆ కుటుంబం మొత్తం అదే గోత్రనామాన్ని పాటిస్తూ వస్తోంది.
ఇక అన్ని కులాల్లో కొన్ని కుటుంబాల ఇంటి పేర్లు వేరైనా గోత్రాలు మాత్రం ఒక్కటే ఉంటుంది.
అంతేకాకుండా ఒకే కుటుంబానికి చెందిన వాళ్లు కాబట్టి అన్నా చెల్లెళ్ల వరుస వస్తుంది.
అందుకే ఒకే గోత్రం ఉన్నవాళ్లు పెళ్లిళ్లు చేసుకోరు.
అలాగే పెళ్లి చూపులకి వెళ్లే ముందే ఇంటి పేరుతో పాటు గోత్రనామాలను కూడా తెలుసుకుంటారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి