వినాయక చవితి రోజున పొరపాటున కూడా ఈ పని చేయవద్దు.. 

14 September 2023

  గణేష్ చతుర్థి నాడు గణపతిని పూజించేటప్పుడు కొన్ని నియమాలను ప్రత్యేకంగా గుర్తుంచుకోవాలి. లేకపోతే శుభ ఫలితాలకు బదులు అశుభ ఫలితాలు లభిస్తాయి

వినాయక చవితి రోజున చంద్రుడిని చూడటం అశుభమని నమ్మకం. చవితిరోజున చంద్రుడుని చూస్తే నీలాపనిందలు, సమస్యలు వస్తాయి

గణపతిని చూసి నవ్విన చంద్రుడికి పార్వతి ఇచ్చిన శాప ప్రభావం వలన చవితి రోజున పొరపాటున చంద్రుడిని చూస్తే దోషం ఏర్పడుతుంది. 

వినాయక చవితి రోజున చంద్రుడిని చూడడానికి అందుకే భయపడతారు. చంద్రుడిని చూస్తే వచ్చే కష్ట నష్టాలకు భయపడి గణేష్ చతుర్థి రోజున రాత్రి చంద్రుడిని చూడరు.

గణేశ చతుర్థిని గణేశుడి జన్మదినంగా జరుపుకుంటారు. ఈ రోజున చంద్రుని దర్శనానికి సంబంధించి కొన్ని ప్రత్యేక నియమ, నిబంధనలు ఉన్నాయి

వినాయక చవితి రోజున అనుకోకుండా చంద్రుడు కనిపిస్తే నిందలు పడాల్సి వస్తుంద అని కంగారు పడతారు. అయితే అస్సలు కంగారు పడకండి

ఈ దోషం తొలగిపోవాలంటే ముందుగా గణపతిని పూజించి, పూలు, పండ్లు సమర్పించి చంద్రుడికి చూపించి పేదవాడికి దానం ఇవ్వాలి.

భవిష్యత్తులో అపవాదులు రాకుండా ఉండటానికి  పూర్తి భక్తి, విశ్వాసంతో గణపతిని పూజించి కథ అక్షతలను నెత్తి మీద వేసుకోవాలి