సూర్యోదయం తర్వాత ఈ పనులు చేయవద్దు.. ఎందుకో తెలుసా 

01 September 2023

గోళ్లను కత్తిరించుకోవద్దని చెబుతారు. ఇలా చేయడం వలన శరీరంలో శక్తి ప్రవాహానికి అంతరాయం కలిగుతుందని నమ్మకం.  

శాస్త్రాలలో దానం చేయడం చాలా ఫలవంతంగా పరిగణించబడుతుంది. అయితే ప్రతికూల శక్తి ప్రవాహాన్ని నిరోధించడానికి సూర్యాస్తమయం తర్వాత దానం చేయవద్దు

విరిగిన వస్తువులు విచ్ఛిన్నమైన శక్తిని కలిగి ఉంటాయి. శక్తి సమతుల్యతను విచ్చిన్నం చేస్తాయి. కనుక సూర్యాస్తమయం తర్వాత విరిగిన వస్తువులను ఉపయోగించవద్దు 

రాత్రిపూట బట్టలను ఉతకడం ప్రతికూల శక్తిని ఆహ్వానించినట్లే.. కనుక రాత్రిపూట ఉతికిన బట్టలు ధరించడం మానసిక స్థితిని ప్రభావితం చేస్తుంది.

సూర్యాస్తమయం తర్వాత మొక్కలను నాటవద్దు. సూర్యకాంతి లేకపోవడం వల్ల  మొక్కల పెరుగుదలకు ఆటంకం కలుగుతుంది

సూర్యాస్తమయం తర్వాత జుట్టు కత్తిరించవద్దు. జుట్టు శక్తిని కలిగి ఉంటుంది. సాయంత్రం సమయంలో కత్తిరించడం వలన అంతర్గత సమతుల్యతపై ప్రభావం చూపిస్తుంది

సూర్యాస్తమయం తర్వాత అధిక గాడ్జెట్ ను ఉపయోగించడం నిద్ర, శక్తి సమతుల్యతను దెబ్బతీస్తుంది. ఈ పరికరాల ద్వారా వెలువడే నీలి కాంతి మెలటోనిన్ నిద్రపై ప్రభావం చూపిస్తుంది

సూర్యాస్తమయం తర్వాత అద్దంలోకి చూడడం మానుకోండి. ప్రతికూల శక్తిని అద్దాలు ప్రతిబింబించగలవు. అంతేకాదు మనసు చంచలత్వం, అసౌకర్యానికి దారితీయవచ్చు