07 December 2023
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఎప్పుడూ బియ్యం వంటి ఆహార పదార్ధాలకు కొరత ఉండకూడదు. లేదంటే అన్నపూర్ణ దేవికి కోపం రావచ్చు. ఆర్థిక సమస్యలకు దారితీయవచ్చు.
పూజ గదిలో ఉంచిన పంచ పాత్రను ఎప్పుడూ ఖాళీగా ఉండనివ్వవద్దు. వాస్తు శాస్త్రం ప్రకారం పంచ పాత్రఖాళీగా ఉంటే ఆర్ధిక ఇబ్బందులు తప్పవట.
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి వంటగదిలోని బిందె నిండుగా ఎప్పుడూ నీళ్లు నింపాలి. లేకపోతే ఆర్థిక సంక్షోభం ఏర్పడవచ్చు.
ఎప్పుడూ పర్సును పూర్తిగా ఖాళీ ఉంచకూడదు. కొంత డబ్బును తప్పనిసరిగా ఉంచుకోవాలి. లేకుంటే ఆకస్మికంగా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంది.
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో చీపురు అరిగిపోతే వెంటనే కొత్తది తీసుకురావాలి. అరిగిన చీపురుతో శుభ్రం చేయడం వల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుంది.
వాస్తు శాస్త్రం ప్రకారం పగిలిన పాత్రలను ఇంట్లో ఎప్పుడూ ఉంచకూడదు. పగిలిన పాత్రల్లో ఆహారం తింటే ఇంట్లో డబ్బు ఎప్పటికీ నిలవదని అంటారు.
ఇంట్లోని బాత్రూమ్ లేదా వంటగదిలో ఏదైనా కుళాయి నుండి నీరు కారుతుంటే దాన్ని సరిదిద్దండి. లేకపోతే ఇంట్లో ఆనందం, శాంతి పోతుందని అంటారు.