ఈ వస్తువులను కారులో ఉంచితే నెగె
టీవ్ ఎనర్జీ తొలగిపోతుంది
8 August 2023
ప్రస్తుత కాలంలో చాలా మంది ప్రైవేటు వెహికిల్స్ ఆశ్రయించడం కంటే.. సొంతంగా కారును కలిగి ఉన్నారు.
కారును కొనే ముందు కంపెనీ, రంగు, నెంబర్, సంబంధిత డాక్యుమెంట్స్ సహా అన్నింటిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు.
ఇదిలా ఉంటే.. ఇంట్లో మాదిరిగానే కారులో కూడా ప్రతికూల శక్తిని తొలగించడానికి కొన్ని వాస్తు నియమాలు పాటించాలని పురోహితులు చెబుతున్నారు.
పురోహితుల మాట ఏంటంటే.. ఇలా కొన్ని నియమాలు పాటించడం వల్ల రాబోయే సంక్షోభం, ప్రమాదాన్ని నివారించొచ్చు.
రాళ్ల ఉప్పు, బేకింగ్ సోడా కలిపిన న్యూస్ పేపర్‌ను సీటు కింద ఉంచాలి. దీనిని రోజూ మార్చాలి.
కారులో ఎప్పుడూ ఒక వాటర్ బాటిల్ ఉంచుకోవాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఇది నెగిటివ్ ఎనర్జీని తరిమేస్తుంది.
కారులో చిన్న గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి. అది మీకు కావల్సినంత పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది.
కారు లోపల చిన్న నల్లరంగు తాబేలు బొమ్మ ఉంచాలి. ఇది ప్రతికూల శక్తిని దరికి చేరనివ్వదని అంటారు.
సువాసన వెదజల్లే చిన్న ఆయిల్ బాటిల్ మీ కారులో ఎప్పుడూ ఉంచుకోవాలి. అప్పుడే అనుకూల శక్తి మీకు అందుతుంది
ఇక్కడ క్లిక్ చేయండి..