అయోధ్యలో లక్షల్లో అమ్ముడవుతున్న తులసి మాలలు!
29 November 2023
కార్తీకమాసం సందర్భంగా అయోధ్యకు దాదాపు 30 లక్షల మంది రామభక్తులు తరలివచ్చారు. వీరిలో యువత అధికంగా ఉన్నారు.
ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో రామాలయ నిర్మాణంలో భాగస్వాములవుతున్న యువత సనాతన సంస్కృతి వైపు ఆకర్షితులవుతున్నారు.
ఇటీవలి కాలంలో భారత దేశంలో అన్ని ప్రాంతాల్లో యువత ఆలయాలకు చేరుకుని, పూజలు చేస్తుండటం మరింతగా కనిపిస్తోంది.
అయోధ్యలో రామమందిరం వద్ద తులసి మాలల వ్యాపారం జోరుగా సాగుతోంది. లక్షల సంఖ్యలో తులసి మాలలు విక్రయమవుతున్నాయి.
దేశవ్యాప్తంగా అయోధ్యలో రామమందిరనికి తరలి వచ్చిన యువత తులసి మాలలు ధరించేందుకు అమితంగా ఆసక్తి చూపుతున్నారు.
గత ఏడాది కాలంగా అయోధ్యలో తులసి, రోజా, రుద్రాక్ష మాలలను యువతీయువకులు కొనుగోలు చేస్తున్నారని తెలుస్తోంది.
తులసి మాల ధారణతో మనస్సు, వాక్కు రెండింటికీ స్వచ్ఛత లభిస్తుందనీ, మనశ్శాంతి లభిస్తుందనీ, రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.
ఈ రామమందిరం నిర్మాణం త్వరలో పూర్తిచేసి 24 జనవరి 2024న ఆ అయోధ్య రామయ్యను దర్శించుకొనే అవకాశాలు కల్పించేందుకు సన్నాహాలు జారుతున్నాయి.
ఇక్కడ క్లిక్ చెయ్యండి