తిరుమలలో రీల్స్ చేస్తే ఇక అంతే సంగతులు..!

02 August 2025

Prudvi Battula 

తిరుమలలో రీల్స్ చేసే వారికి కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ).

తిరుమల కొండపై శ్రీవారి పవిత్రతను భంగం కలిగించేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకొంటామన్నారు టీటీడీ అధికారులు.

తిరుమల శ్రీ‌వారి ఆల‌యం ప్రాంగణం, మాడ వీధుల్లో వెకిలి చేష్టలు, డాన్స్ చేస్తూ వీడియోలు చిత్రీకరిస్తే నేరం.

తిరుమలతో చిత్రీకరించిన వీడియోలను సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్‌ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్న టీటీడీ.

పవిత్రమైన ఆధ్యాత్మిక క్షేత్రంలో ఇలాంటి అభ్యంతరకర,అసభ్యకర చర్యలు అనుచితమని అన్నారు తిరుమల దేవస్థానం అధికారులు.

శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీసే ఈ తరహా చర్యలు ఆధ్యాత్మిక వాతావరణానికి విఘాతం కలిగిస్తున్నాయన్న టీటీడీ.

తిరుమల క్షేత్రం భక్తి, ఆరాధనలకు నిలయమని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని టీటీడీ అధికారులు వెల్లడించారు.

టీటీడీ విజిలెన్స్, సెక్యూరిటీ సిబ్బంది ఇలాంటి వీడియోలు చిత్రీకరించేవారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటారని హెచ్చరిక.