గణపతికి తొలి రోజు ప్రసాదం డిఫరెంట్‎గా ట్రై చెయ్యండి ఇలా..

05 September 2024

Battula Prudvi 

సర్వ విఘ్నాలకు అధిపతి అయినా గణపతికి వినాయక చవితి తొలిరోజు ఉండ్రాళ్లను కచ్చితంగా నైవేద్యంగా సమర్పిస్తారు.

గణేశునికి ప్రీతికరమైన ఉండ్రాళ్లను చాల రకాలుగా తయారుచేస్తారు. వీటిలో బెల్లం రవ్వ ఉండ్రాళ్లను ఎలా చేయాలో తెలుసుకుందాం.

దీని కోసం బొంబాయి రవ్వ: అరకప్పు, బెల్లం తరుగు: అరకప్పు, తాజా కొబ్బరి తురుము: పావుకప్పు, పెసరపప్పు: టేబుల్‌స్పూను, యాలకులపొడి: పావుచెంచా, నెయ్యి: రెండు చెంచాలు, నీళ్లు: కప్పు కావాలి.

మీరు బెల్లం రవ్వ ఉండ్రాళ్లను తయారుచేయడానికి ఒక అరగంట ముందు టేబుల్‌స్పూను పెసరపప్పును నీటిలో నానబెట్టాలి.

ముందుగా స్టౌ మీద బాణలిని పెట్టి ఆన్ చేసి బొంబాయి రవ్వను దోరగా రంగు మారేంత వరకు వేయించుకుని పక్కన పెట్టుకోవాలి.

అదే బాణలిలో నీళ్లు, బెల్లం తరుగు వేసుకోని పాకంలా తయారవుతున్నప్పుడు కొబ్బరి తురుము, పెసరపప్పు వేసి బాగా కలపాలి.

రెండు నిమిషాల అందులోనే వేయించిన బొంబాయి రవ్వ, యాలకులపొడి, చెంచా నెయ్యి వేసుకుని బాగా కలిపి స్టౌని సిమ్‌లో పెట్టి దగ్గరకు అయ్యాక దింపేయాలి.

ఇది పూర్తిగా చల్లారాక చేతికి నెయ్యి రాసుకుంటూ ఉండ్రాళ్లలా చేసుకుని ఇడ్లీ పాత్రలో ఆవిరి మీద పది నిమిషాల వరకూ ఉడికిస్తే చాలు.