13 September 2024
TV9 Telugu
Pic credit - Pexels
కేరళలోని పద్మనాభస్వామి ఆలయం ప్రపంచంలోనే అత్యంత ధనిక దేవాలయంగా పరిగణించబడుతుంది. బంగారం, ఆభరణాలు, విలువైన కళాఖండాలున్న ఆలయంగా ప్రసిద్ది
కలియుగ దైవం తిరుమల వేంకటేశ్వర దేవాలయం కూడా ధనిక దేవాలయమే. ప్రతి సంవత్సరం మిలియన్ల మంది యాత్రికులు బంగారం, డబ్బులు, విలువైన వస్తువులను కానుకలుగా అందిస్తునే ఉన్నారు.
మహారాష్ట్రలోని ఈ దేవాలయం భారతదేశంలోని సంపన్న దేవాలయాలలో ఒకటి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు నగదు, బంగారం, ఇతర కానుకలను ఉదారంగా విరాళంగా అందిస్తున్నారు.
వైష్ణో దేవి ఆలయం త్రికూట పర్వతాలలో నెలకొని ఉంది. ప్రతి సంవత్సరం వైష్ణవి దేవిని లక్షలాది మంది యాత్రికులు సందర్శిస్తూ భారీగా నగదు కనులను సమర్పిస్తారు.
ముంబైలోని సిద్ధివినాయక దేవాలయం కూడా ధనిక దేవలయమే. వినాయకుడికి భారీగా విరాళాలు అందిస్తారు. సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు గణపయ్యకు బంగారం, నగదుని కానుకలుగా సమర్పిస్తారు.
హర్మందిర్ సాహిబ్ అని కూడా పిలుస్తారు. ఇది సిక్కు మతానికి చెందిన ఆధ్యాత్మిక కేంద్రం. బంగారం, ఆభరణాలు, నగదును భారీ విరాళాలగా అందుకుంటుంది. దేశంలోని అత్యంత సంపన్న దేవాలయాలలో ఒకటిగా నిలిచింది.
మధురైలోని మీనాక్షి ఆలయం.. దీని నిర్మాణ సౌందర్యమే కాదు శతాబ్దాలుగా హిందువుల విశ్వాసానికి కేంద్రం. విరాళాలు, కనుక ద్వారా అమ్మవారి సంపద కూడా ప్రసిద్ధి చెందింది.
ఒడిశాలో ఉన్న ఈ ఆలయం జగన్నాథ రథయాత్ర ప్రపంచ ప్రసిద్ధి చెందింది. రాజులు సమర్పించిన కానుకలు, భూమి విరాళాలతో పాటు భక్తులు సమర్పిస్తున్న కానుకలతో సంపద గల దేవాలయంగా ఖ్యాతిగాంచింది.
పవిత్రమైన హిందూ దేవాలయాలలో ఒకటి కాశీ విశ్వనాధ్ ఆలయం. ఇది బంగారు పూతతో కూడిన గోపురంతో ప్రసిద్ధి చెందింది. విశ్వేశ్వరుడికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భక్తుల నుండి ఉదారంగా విరాళాలు లభిస్తాయి.
లయకారుడైన శివుని 12 జ్యోతిర్లింగ క్షేత్రాలలో ఒకటి సోమనాథ్ ఆలయం. చారిత్రాత్మకంగా మాత్రమే కాదు బంగారం, వెండి, నగదు విరాళాలతో కూడిన సంపదతో ప్రసిద్ధి చెందింది.