మన దేశంలో టాప్ 10 సంపన్న ఆలయాలు.. 

14 January 2024

TV9 Telugu

పద్మనాభస్వామి ఆలయం దశాబ్దాల క్రితం ఖజానాలో అపారమైన సంపద వెలుగులోకి వచ్చింది. దీంతో ప్రపంచంలోని అత్యంత ధనిక దేవాలయాలలో ఒకటిగా నిలిచింది 

పద్మనాభస్వామి ఆలయం 

ఆంధ్రప్రదేశ్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రపంచంలోని అత్యంత ధనిక దేవాలయాలలో ఒకటి. స్వామివారికి భారీ విరాళాలు ఇస్తారు. వార్షిక ఆదాయం చాలా ఎక్కువ!

తిరుపతి 

సాయిబాబాకు అంకితం చేయబడిన ఈ మందిరాన్ని ప్రపంచవ్యాప్తంగా భక్తులు సందర్శిస్తారు.  గణనీయమైన విరాళాలు లభిస్తాయి. 

షిర్డీ సాయిబాబా ఆలయం 

ముంబైలో ఉన్న ఈ ఆలయం గణేశుడికి అంకితం చేయబడింది. సినీ సెలబ్రెటీలు కూడా ఈ ఆలయాన్ని దర్శించుకుంటారు.  

సిద్ధివినాయక దేవాలయం 

పూరిలోని జగన్నాథ దేవాలయం రథయాత్రకు ప్రసిద్ధి. ఇది భారతదేశంలోని అత్యంత ధనిక దేవాలయాలలో ఒకటి. దేశ విదేశాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు దర్శించుకుంటారు. 

జగన్నాథ దేవాలయం

శ్రీకృష్ణునికి అంకితం చేయబడిన  కేరళలోని గురువాయూర్ ఆలయం సంపన్న ఆలయాల్లో ఒకటి. ఇది చాలా గొప్ప పుణ్యక్షేత్రం.

గురువాయూర్ ఆలయం

మదురైలోని ఈ ఆలయం మీనాక్షి దేవత మరియు సుందరేశ్వర స్వామికి అంకితం చేయబడింది. దేశంలోని అత్యంత ధనిక దేవాలయాలలో ఇది కూడా ఒకటి.

 మీనాక్షి అమ్మవారి ఆలయం 

హిందూమతంలోని అత్యంత పవిత్రమైన దేవాలయాలలో ఒకటి. వారణాసిలోని కాశీ విశ్వనాథ దేవాలయం  ఒక ముఖ్యమైన పుణ్యక్షేత్రం.

 కాశీ విశ్వనాథ దేవాలయం 

పంజాబ్‌లోని స్వర్ణ దేవాలయం కూడా భారతదేశంలోని సంపన్న దేవాలయాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. 

 గోల్డెన్ టెంపుల్ 

వైష్ణో దేవి ఆలయం భారతదేశంలో అత్యధికంగా సందర్శించే  ఆలయాల్లో ఒకటి. భారీ సంఖ్యలో భక్తులు అమ్మవారికి విరాళాలు అందజేస్తారు. 

వైష్ణో దేవి ఆలయం