శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ చెప్పిన టీటీడీ..

TV9 Telugu

31 January 2024

కలియుగ వైకుంఠంగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన క్షేత్రం తిరుమల. ప్రతిఏటా కోట్ల మంది భక్తులతో కోలాహలంగా ఉంటుంది.

తిరుమల ఏడూ కొండలపై కొలువుదీరిన శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి ప్రమంచవ్యాప్తంగా భక్తులు తరలి వస్తారు.

ఇలా వచ్చిన భక్తులు తమకు తోచిన కానుకలు శ్రీవారికి సమర్పించుకుంటారు. ఇలా ఏటా కొన్ని కోట్ల ఆదాయం సమకూరుతుంది.

ఇదిలా ఉంటె తిరుమల వెంకటేశ్వర స్వామి భక్తులకు ఓ శుభవార్త తెలిపారు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు.

తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు శ్రీవారి భక్తుల కోసం మంగళసూత్రాలు విక్రయించేందుకు నిర్ణయం తీసుకున్నారు.

శ్రీవారి పాదాల చెంత పూజలు చేసి వాటిని కొత్త జంటలకు అందించనున్నారు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు.

శ్రీవారికి వచ్చే బంగారు కానుకలతో 5 నుంచి 10గ్రాముల మేర మంగళసూత్రాలు తయారు చేయించాలని.. టీటీడీ పాలకమండలి భేటీలో నిర్ణయించారు.

ఇక 2024-25కు సంబంధించి 5,141 కోట్లతో టీటీడీ వార్షిక బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది తిరుమల తిరుపతి పాలకమండలి.