11 July 2024
TV9 Telugu
Pic credit - TTD
3 అక్టోబర్ 2024 గురువారం రాత్రి: 7 నుంచి 8 వరకు వార్షిక బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ, విశ్వక్సేన ఆరాధన చేయనున్నారు.
5 అక్టోబర్ 2024 శనివారం 2వ రోజు: ఉదయం చిన శేష వాహనం సేవ మధ్యాహ్నం స్నపన తిరుమంజనం నిర్వహించనున్నారు. రాత్రి మలయప్ప స్వామి దేవేరులతో కలిసి హంస వాహనంపై దర్శనం ఇవ్వనున్నారు.
5 అక్టోబర్ 2024 శనివారం 2వ రోజు: ఉదయం చిన శేష వాహనం సేవ మధ్యాహ్నం స్నపన తిరుమంజనం నిర్వహించనున్నారు. రాత్రి మలయప్ప స్వామి దేవేరులతో కలిసి హంస వాహనంపై దర్శనం ఇవ్వనున్నారు.
6 అక్టోబర్ 2024 ఆదివారం 3వ రోజు ఉదయం సింహవాహనం సేవ జరగనుండగా.. మధ్యాహ్నం స్నపన తిరుమంజనం.. రాత్రి ముత్యాల పల్లకీ వాహనం సేవ జరగనుంది.
7 అక్టోబర్ 2024 సోమవారం 4వ రోజు ఉదయం కల్పవృక్ష వాహనం సేవ... సాయంత్రం శ్రీవారు దేవేరులతో కలిసి సర్వభూపాల వాహనంపై ఊరేగనున్నారు.
8 అక్టోబర్ 2024 మంగళవారం 5వ రోజు ఉదయం మోహినీ అవతారంలో స్వామివారు దర్శనం. రాత్రి గరుడ వాహనం సేవను నిర్వహించనున్నారు.
9 అక్టోబర్ 2024 బుధవారం 6వ రోజు ఉదయం హనుమంత వాహన సేవ సాయంత్రం స్వర్ణ రథోత్సవం .. రాత్రి గజవాహనం మీద స్వామివారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.
10 అక్టోబర్ 2024 గురువారం 7వ రోజు ఉదయం సూర్య ప్రభ వాహన సేవ.. మధ్యాహ్నం స్నపన తిరుమంజనం.. రాత్రి చంద్రప్రభ వాహన సేవ జరగనుంది.
11 అక్టోబర్ 2024 శుక్రవారం 8వ రోజు ఉదయం రథోత్సవం.. సాయంత్రం అశ్వవాహనం మీద వెంకన్న దేవేరులతో కలిసి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.
12 అక్టోబర్ 2024 శనివారం 9వ రోజు తెల్లవారుజామున పల్లకీ ఉత్సవం, తిరుచ్చి ఉత్సవం నిర్వహించనున్నారు. ఉదయం స్నపన తిరుమంజనం అనతరం చక్రస్నానంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి