శివరాత్రికి ఉపవాసం చేస్తున్నారా? అయితే ఈ టిప్స్ మీకోసమే..!

TV9 Telugu

07 March 2024

మహాశివరాత్రి ఉపవాసం పండుగ రోజు ఉదయం ప్రారంభమై.. రాత్రి జాగారం పూర్తిచేసుకున్న తర్వాత ఉదయం ముగుస్తుంది.

మహాశివరాత్రి పండగ రోజున ఉపవాసం ఉంటున్నారా? అయితే మీరు ఉపవాస సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటంటే.

మీరు పవిత్రమైన ఉపవాసాన్ని చేస్తున్నప్పుడు సంతోషంగా, ప్రశాంతంగా, పూజలు చేసుకుంటూ.. రోజంతా సాఫీగా ఉండాలి.

ఉపవాసం ఉన్నప్పుడు కనీసం ఎనిమిది గ్లాసుల నీటిని తాగాలి. ఇది శరీరంలోని టాక్సిన్స్, వ్యర్థాలను బయటకు పంపిస్తుంది.

ఉపవాస సమయంలో శారీరక శ్రమ ఎక్కువ లేకుండా చూసుకోండి. ఆధ్యాత్మిక పుస్తకాలు చదవడం, భక్తి సంగీతం వినడం వంటివి చెయ్యండి.

గర్భిణీలు, మధుమేహం ఉన్నవారు, జీర్ణ సమస్యలు వంటి ఆరోగ్య సమస్యలు ఉన్నవారు కనీసం ద్రవ రూపంలోనైనా తీసుకోవాలి.

మీరు ఉపవాసం విరమించే సమయంలో అన్నం తినేయకండి. ఇది చాలా ప్రమాదకరం. ఇది మీ ఆరోగ్యాన్ని బాగా దెబ్బతీస్తుంది.

ఉపవాసం విరమించాకా.. ముందు ఏదైనా జ్యూస్ తీసుకోవాలి. కాసేపు ఆగిన తర్వాత ఫ్రూట్స్​ తిని.. తర్వాత తేలికైన ఆహారం తీసుకోవాలి.

ఫైబర్, ప్రోటీన్లు ఎక్కువగా, కేలరీలు తక్కువ కలిగిన ఫుడ్ తీసుకోవాలి. ఇక వైద్యుడిని సంప్రదించి.. ఉపవాసం చేస్తే మంచిది.