ఈ వస్తువులు ఇంట్లో ఉంటే అన్ని అశుభాలేనట..!

TV9 Telugu

17 March 2024

మూఢ న‌మ్మకం అనుకోకుండా ప‌లు వ‌స్తువులు మీ ఇంట్లో ఉంటే వాటిని వెంట‌నే తీసేయండి అంటున్నారు ఫెంగ్ షుయ్ వాస్తు నిపుణులు.

వాలు కుర్చీ (రాకింగ్ చెయిర్) ఎప్పుడూ ముందుకు, వెనుకకు ఊగుతూ ఉంటుంది. ఈ కుర్చీని అస‌లు ఇండ్లలో పెట్టుకోకూడ‌ద‌ట‌.

ఆకుప‌చ్చ రంగును ఇండ్లలో గోడ‌ల‌కు వేయ‌రాదట. ఈ రంగు అశుభాల‌ను క‌లిగిస్తుంద‌ని చెబుతున్నారు వాస్తు నిపుణులు.

ఇండ్లలో పగిలిన గ‌డియారాల‌ను ఉంచుకోకూడ‌ద‌ని ఫెంగ్ షుయ్ వాస్తు చెబుతోంది. వీటి వ‌ల్ల ఇంట్లో ఉండే వారు ప్రమాదాల బారిన ప‌డ‌తారట.

బ్రహ్మజెముడు, నాగ‌జెముడు జాతికి చెందిన కాక్టి మొక్కల‌ను ఇండ్లలో పెంచుకోరాదట. ఇవి అశుభాల‌ను క‌లిగిస్తాయ‌ని ఫెంగ్ షుయ్ వాస్తు చెబుతోంది.

ఉద‌యం నిద్ర నుంచి లేవ‌గానే బెడ్‌ను స‌ర్దుకోవాలి. లేదంటే అరిష్టం వ‌స్తుంద‌ట‌. ఫెంగ్ షుయ్ వాస్తు ప్రకారం.. స‌రిగ్గా స‌ర్దని బెడ్ అన్నీ అశుభాల‌నే క‌లిగిస్తుంద‌ట‌.

గొడుగుల‌ను ఇంట్లో పెట్టుకోవ‌చ్చు. కానీ ఇంట్లో ఉండే గొడుగుల‌ను మాత్రం ఎప్పుడూ మూసే ఉంచాలి. తెర‌వ‌కూడ‌దట.

మన ఇంటి లోప‌ల పెంచుకునే మొక్కలు ఎప్పుడు ఎండిపోరాదు. వాడిపోరాదు. అవి ఎప్పుడూ ప‌చ్చగా ఉండేలా చూసుకోవాలి.