అద్దె ఇంట్లో పాలు పొంగిస్తున్నారా? ఇక సొంత ఇల్లు కొనలేరంట!

Samatha

28 july  2025

Credit: Instagram

చాలా మంది అద్దె ఇంట్లో నివసిస్తుంటారు. ముఖ్యంగా ఉద్యోగం కోసం సొంతూరు నుంచి పట్నం వచ్చి అద్దె ఇంట్లో నివసిస్తారు.

అయితే కొంత మంది మా ఇల్లు కాదు కదా అని చేసే చిన్న చిన్న పొరపాట్లే వారిని కష్టాల్లోకి నెట్టేస్తాయి అంటున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు.

సొంతింటి కల నెరవేర్చుకోవాలని ఎవరికి ఉండదు చెప్పండి. చాలా మంది సొంత ఇల్లు నిర్మాణం కోసం ఎన్నో కష్టాలు పడుతుంటారు.

అయితే సొంతిల్లు నిర్మించుకోవాలి అనుకునేవారు, అద్దె ఇంట్లో కొన్ని పొరపాట్లు చేయడం వలన వారి కలను నెరవేర్చుకోలేరంట.

మన సొంతిల్లు కాదు కదా అని కొన్ని వాస్తు నియమాలను పట్టించుకోకపోవడం వలన సొంతతింటి కల కలగానే మిగిలిపోతుందంటున్నారు నిపుణులు.

అందువలన, జోతిష్య నిపుణుల ప్రకారం  అద్దె ఇంట్లో ఉన్నప్పుడు ఏలాంటి తప్పులు చేయకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

అద్దె ఇంట్లో కారుతున్న కుళాయిని వెంటనే రిపేరు చేయాలని, లేకుంటే ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తుంది. దీని వలన మీరు అప్పులపాలై, సొంతిల్లు నిర్మించుకోలేరు.

అలాగే చాలా మంది అద్దె ఇంట్లో పాలు పొంగిస్తుంటారు. అయితే ఇలా పాలు పొంగించడం వలన సొంతింటి కల నెరవేరదు అంటున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు.