శివరాత్రి స్పెషల్.. భారత దేశంలో 10 ఫేమస్ శివాలయాలు ఇవే!

samatha 

23 February 2025

Credit: Instagram

మహా శివరాత్రి వచ్చేస్తుంది. కాగా, శివరాత్రికి భక్తులు సందర్శించడానికి భారత దేశంలో 10 ఫేమస్ శివాలయాలు ఏవో తెలుసుకుందాం.

కేదార్ నాథ్ ఆలయం, ఉత్తరాఖండ్ లోం ఉంది. హిమాలయాలు, ప్రకృతి మధ్య అక్కడ శివుడు కొలువుదీరాడు. ఇది యాత్రికులను ఎంతగానో ఆకర్షిస్తుంది.

సోమనాథ్ ఆలయం. ఇది గుజరాత్ లో ఉంది. అరేబియా సముద్రం ఒడ్డున  ఉన్న పురాతన సోమనాథ్ ఆలయంలో జ్యోతిర్లింగం రూపంలో శివుడు దర్శనం ఇస్తాడు.

కాశీ విశ్వనాథ్ ఆలయం ఇది వారణాసిలో ఉంది. ఈ ఆలయం సమస్యల నుంచి విముక్తినిస్తుంది. ఆధ్యాత్మిక జ్ఞానోదయం కోరుకునే లక్షలాది మందిని ఆకర్షిస్తుంది.

త్రయంబకేశ్వర్ ఆలయం ఇది మహారాష్ట్రలో ఉంది. గోదావరి నదికి సమీపంలో ఉన్న త్రయంబకేశ్వర్ బ్రహ్మ, విష్ణు మరియు రుద్రులను సూచించే ప్రత్యేకమైన మూడు ముఖాల శివ విగ్రహానికి ప్రసిద్ధి చెందింది.

రామనాథస్వామి ఆలయం ప్రసిద్ధ ఆలయాల్లో ఇదొక్కటి. ఇది తమిళనాడులో ఉంది. రామేశ్వరం ద్వీపంలో, రామనాథస్వామి ఆలయం అద్భుతమైన నిర్మాణాలతో ఇది  భక్తులను ఆకర్షిస్తుంది.

అమర్‌నాథ్ ఆలయం ఇది కాశ్మీర్‌లో ఉంది. అమర్‌నాథ్ ఆలయంలోని మంచు శివలింగం , దైవిక ఆశీర్వాదం కోరుకునే వేలాది మంది భక్తులను ఆకర్షిస్తుంది.  

 ఉత్తరా ఖండ్ లో  జగేశ్వర్ ఆలయం,  మద్మహేశ్వర్ ఆలయం, బాగ్నాథ్ ఆలయం,అలాగే గుజరాత్ లో నాగేశ్వర్ ఆలయం చాలా ప్రసిద్ధ దేవాలయాలు.