అందుకే 11వ రోజు గణపతి నిమజ్జనం శుభప్రదం..
15 September 2024
Battula Prudvi
వినాయక చవితి సందర్భంగా గణపతి పూజ చేసేవారు నిమజ్జనం ఒక్కొక్కరు ఒక్కోరోజు వారి బలాన్ని బట్టి ఎంపిక చేసుకుంటారు.
కొందరు చవితి ఉదయం పూజచేసి సాయంత్రానికి నిమజ్జనం చేస్తారు. మరికొందరు మూడో రోజు, ఐదోరోజు నిమజ్జనం చేస్తారు.
సాధారణంగా విఘ్నేశ్వరుడి విగ్రహాన్ని ఏడో రోజు నాడు నిమజ్జనం చేసేవారి సంఖ్య మాత్రం చాలా తక్కువగా ఉంటుంది.
మళ్లీ తొమ్మిదోరోజు నిమజ్జనాల సందడి సాగుతుంది. అయితే వినాయక నిమజ్జనానికి 11వ రోజు మాత్రం శుభప్రదంగా భావిస్తారు.
ఎందుకంటే సరిగ్గా 11వ రోజున భాద్రపద మాసంలో అత్యంత విశిష్టమైనరోజు పౌర్ణమి ముందు వచ్చే అనంత చతుర్థశి వస్తుంది.
అందుకే పదకొండోరోజున చెరువులు, నదులు, సరస్సులు, కొలనులు..ఇలా నీరు కళకళలాడే ప్రదేశంలో గణపయ్య నిమజ్జనం చేస్తారు.
పదకొండవ రోజున, గణేశ విగ్రహాన్ని నది, సరస్సు లేదా సముద్రం వంటి నీటి ప్రదేశాలకు.. మేళతాళాల మధ్య సంబరంగా శోభాయాత్ర నిర్వహించి నిమజ్జనం చేస్తారు.
నిమజ్జనం తర్వాత గణేషుడు తన తల్లిదండ్రులైన పరమేశ్వరుడు పార్వతిదేవి దగ్గరకు కైలాస పర్వతానికి వెళతాడని భక్తుల విశ్వాసం.
ఇక్కడ క్లిక్ చెయ్యండి