దేవుని పూజలో గంటకు ఉన్న ప్రాముఖ్యత ఏమిటంటే?

ఆరతి తర్వాత గంటను మోగించి తమ కోరికలను దేవునికి తెలియజేస్తారు

హిందూ విశ్వాసం ప్రకారం, మీరు ఏదైనా ఆలయంలోకి ప్రవేశించేటప్పుడు గంటను మోగిస్తే.. దాని ప్రతిధ్వనితో ప్రతికూల శక్తి మొత్తం తొలగిపోతుంది.

ఆలయ గంట శబ్దం ద్వారా ఉత్పన్నమయ్యే కంపనం పర్యావరణంలో ఉన్న హానికరమైన బ్యాక్టీరియాను నాశనం చేస్తుందని నమ్ముతారు

హిందూ విశ్వాసం ప్రకారం మీరు ఏదైనా ఆలయంలో లేదా ఇంటి పూజలో గంటను మోగించినప్పుడు.. అది జీవితంలోని పాపాలను నాశనం చేస్తుంది

ఆలయ గంటలు లేదా గంట మోగించడం వల్ల వచ్చే ధ్వనితో సానుకూల శక్తి వస్తుంది. మీ ప్రార్థనలు నేరుగా దేవునికి చేరతాయి.

గంట నుండి 'ఓం' అనే పదం వంటి శబ్దం వెలువడుతుందని.. అప్పుడు ఆ పవిత్ర పదాన్ని ఉచ్చరించిన ప్రతిఫలాన్ని పొందుతారని నమ్ముతారు

పూజలో మోగించే గంటను  గరుడ గంట అంటారు

ఇంట్లో చేతితో మోగించే గరుడ గంట విష్ణు వాహనం చిహ్నంగా భావిస్తారు. ఈ గంట మ్రోగిస్తే ఎవరి జాతకంలో రాహు-కేతు దోషం తొలగిపోతుంది.