రాముడి విగ్రహం నుదిటిపై సూర్య కిరణాలు.. 

07 January 2024

TV9 Telugu

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామ మందిర నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. జనవరి 22వ తేదీన రామ మందిరం ప్రారంభోత్సవంపై అందరి దృష్టి పడింది.

రామ మందిర నిర్మాణంతో అయోధ్యంలో రియల్ ఎస్టేట్‌ సైతం ఊపందుకుంది. భూముల ధరలు నాలుగు రెట్లు పెరిగాయి.

ఇక ఈ ధరలు మరింత పెరుతాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. స్థానికులే కాకుండా బయటివారు కూడా ఇక్కడ భూములు కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

ప్రముఖ హోటలల్స్‌ అయిన తాజ్,  రాడిసన్ వంటి అయోధ్యలో భూమి కొనేందుకు ఆసక్తిని కనబరుస్తున్నాయి. దీంతో ఒక్కసారిగా ధరలకు రెక్కలొచ్చాయి.

ఇదిలా ఉంటే రామ నిర్మాణంలో ఎన్నో ప్రత్యేకతలు ఉండేలా చూసుకుంటున్నారు. అయోధ్య రామాలయానికి శిల్పులు అదనపు హంగులు జోడిస్తున్నారు.

ఆలయ గర్భగుడిలోని రాముడి విగ్రహాన్ని సూర్యకిరణాలు తాకేలా ఏర్పాట్లు చేస్తున్నారు. శాస్త్రీయంగా ఈ ప్రక్రియ జరిగేలా చూస్తున్నారు. 

ఇందుకోసం రామాలయ ప్రాంగణంలో ప్రత్యేక నిర్మాణం చేపడుతున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు సూర్య కిరణాలు రాముడి విగ్రహం నుదిటిపై పడతాయి.

ఇందుకోసం భారత అంతరిక్ష శాస్త్రవేత్తల సహాకారం తీసుకున్నారని సమాచారం. శాస్త్రవేత్తల పర్యవేక్షణలో నిర్మాణాలు చేపట్టారు.