ఒకసారి శ్రీ కృష్ణుడి వేలికి గాయమై రక్తస్రావం కావడంతో ద్రౌపతి చీర కొంగులోని కొంత భాగాన్ని చింపి శ్రీకృష్ణుని వేలికి కట్టింది.
దీని సంతోషించిన కృష్ణుడు ఎలాంటి పరిస్థితిలోనైనా నిన్ను రక్షిస్తానని చెప్పాడు.ఇచ్సిన మాట ప్రకారం నిండు సభలో ద్రౌపతిని కృష్ణుడు రక్షిస్తాడు.
అప్పటి నుంచి రాఖీ జరుగుతుందని కొంతమంది కథ చెబుతుంటారు. దీనికి మరో కథ కూడా చెబుతుంటారు హిందూ పండితులు.
యముడు, తన సోదరి యమున 12 సంవత్సరాలపాటు కలవకపోవడంతో యమునా దేవి బాధపడింది. గంగాదేవి తన సోదరిని కలవమని యముడుకి సలహా ఇస్తుంది.
తన సోదరుడు వస్తున్నాడని యమున, రుచికరమైన వంటకాలు చేసి అతని కోసం వేచి చూస్తుంది. యముడు ఇంటికి రాగానే అతడికి ఒక ధారాన్ని కడుతుంది.
ఒకసాయి మహావిష్ణువు బలి తపస్సును మెచ్చి కోరికమేరకు తనతో వెళ్తాడు. వైకుంఠంలో లక్ష్మీదేవి ఒంటరిగా కావడంతో భర్తని తిరిగి రమ్మని కోరగా తిరిగిరాలేను అని అంటాడు.
దీంతో లక్ష్మీదేవి సాధారణ స్త్రీ వేషంలో బలి అంతఃపురంలో చిన్న చిన్న పనులు చేస్తూ బాలి ప్రశంసలను పొంది పవిత్రమైన ధారాన్ని బలికి కడుతుంది.
లక్ష్మీని తన సోదరిగా స్వీకరించిను బలి కూడా ఏంకావాలని అడగ్గా లక్ష్మీ తన నిజరూపం దాల్చి విష్ణువును తిరిగి పంపమని కోరడంతో బాలి అంగికరిస్తాడు.